Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వైభవ్ సూర్యవంశీకి అన్యాయం: అంపైర్ నిర్ణయంపై దుమారం!

Vaibhav Suryavanshi: భారత అండర్-19 యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరుగుతున్న రెండో యూత్ టెస్ట్ మ్యాచ్‌లో అంపైర్ తీసుకున్న తప్పుడు నిర్ణయానికి బలయ్యాడు. తన బ్యాట్ కు బంతి తగలకుండానే అంపైర్ అతడిని ఔట్‌గా ప్రకటించడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. బంతి తగలకుండానే అంపైర్ వేలు ఎత్తడం తీవ్రదుమారం చెలరేగింది.

అంపైర్ తప్పుడు నిర్ణయం.. వైభవ్ ఔట్
ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరుగుతున్న రెండో యూత్ టెస్టులో యువ భారత బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి వివాదాస్పదంగా ఔట్ ఇవ్వడం ఆశ్చర్యం కలిగించింది. కేవలం 14 ఏళ్ల వయసున్న ఈ ఆటగాడు తన బ్యాట్‌కు, బంతికి మధ్య చాలా దూరం ఉందని అంపైర్‌కు స్పష్టంగా చూపించాడు. ఆస్ట్రేలియా ఆటగాడు చార్లెస్ లాచ్‌మండ్ వేసిన బంతికి వైభవ్ సూర్యవంశీ 20 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. ఈ నిర్ణయంపై వైభవ్ సూర్యవంశీ ఆశ్చర్యానికి గురయ్యాడు. అతడి ముఖంలో ఆగ్రహం స్పష్టంగా కనిపించింది.

Vaibhav Suryavanshi Controversial Dismissal Sparks Uproar

మొదటి టెస్టులో వైభవ్ అద్భుత ప్రదర్శన
ఈ సంఘటన భారత్, ఆస్ట్రేలియా అండర్-19 జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో చోటుచేసుకుంది. మొదటి యూత్ టెస్ట్ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ కేవలం 86 బంతుల్లోనే 113 పరుగులు చేసి భారత్ కు ఇన్నింగ్స్, 58 పరుగుల తేడాతో విజయం అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ రెండో టెస్టులో కూడా వైభవ్ సూర్యవంశీ దూకుడుగా ఆడుతూ 14 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 20 పరుగులు చేసి మంచి ఫామ్ లో ఉన్నాడు. కానీ లాచ్‌మండ్ బౌలింగ్ లో అంపైర్ అతడి ఔట్ చేయడంతో బంతి బ్యాట్ కు తగల్లేదని చూపించి వైభవ్ తన నిరసనను తెలియజేశాడు.

ఆస్ట్రేలియా గడ్డపై వైభవ్ సంచలనం
వైభవ్ సూర్యవంశీ ఆస్ట్రేలియా గడ్డపై అద్భుతమైన ఫామ్ కనబరుస్తున్నాడు. యూత్ వన్డేల్లో వేగవంతమైన ఇన్నింగ్స్‌లు ఆడిన తర్వాత, ఇప్పుడు యూత్ టెస్ట్‌లోనూ శతకం సాధించాడు.కేవలం 12 ఏళ్ల వయసులోనే ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన వైభవ్.. 13 ఏళ్ల వయసులో ఐపీఎల్‌లో అదరగొట్టాడు. పురుషుల టీ20లలో అతి తక్కువ వయసులో 35 బంతుల్లోనే సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు.ఈ సంవత్సరమే ఇంగ్లాండ్‌పై యూత్ వన్డేలో వేగవంతమైన సెంచరీ రికార్డును నెలకొల్పాడు.ప్రస్తుతం అంపైర్ తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల వైభవ్ ఇన్నింగ్స్ ముగిసినప్పటికీ, ఆస్ట్రేలియాలో వైభవ్ సూర్యవంశీ ప్రదర్శన యువ క్రికెట్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

Story first published: Wednesday, October 8, 2025, 10:54 [IST]
Other articles published on Oct 8, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+