Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇదెక్కడి దిక్కుమాలిన పోలిక.. వైభవ్ మరో 'అఫ్రిది' అంట!

ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సృష్టించిన సునామీ ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి.. ఆ ఇన్నింగ్స్‌లో 12 సూపర్ సిక్సర్లతో టీ20 క్రికెట్ రికార్డులను బద్ధలు కొట్టన ఈ వండర్ కిడ్ పేరు ఇప్పుడు సరిహద్దులు దాటి పాకిస్థాన్‌కు కూడా చేరింది. ప్యాట్ కమిన్స్ వంటి ప్రపంచ స్థాయి బౌలర్లను కూడా లెక్కచేయకుండా వైభవ్ ఆడిన తీరుకు క్రికెట్ ప్రపంచం ఫిదా అయిపోయింది.

షాహిద్ అఫ్రిదితో పోల్చిన మహమ్మద్ యూసుఫ్
వైభవ్ సూర్యవంశీ భయం లేని బ్యాటింగ్ స్టైల్‌ను చూసి పాకిస్థాన్ మాజీ దిగ్గజ బ్యాటర్ మహమ్మద్ యూసుఫ్ సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపించాడు. వైభవ్‌ను పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది యువకుడిగా ఉన్న రోజులతో పోల్చాడు. "15 ఏళ్ల క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ నాకు యువ షాహిద్ అఫ్రిదిని గుర్తు చేస్తున్నాడు. అతడిలో భయం లేదు, విధ్వంసకరమైన ఆట ఉంది, పూర్తి శక్తి సామర్థ్యాలతో నిండి ఉన్నాడు. క్రికెట్ భవిష్యత్తు ఇక్కడే ఉంది!" అని యూసుఫ్ ట్వీట్ చేశాడు. యూసుఫ్ పోలికను చూసిన ఫ్యాన్స్.. ఇదెక్కడి దిక్కుమాలిన పోలిక అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Vaibhav Suryavanshi Compared to Shahid Afridi by Pak Legend Mohammad Yousuf Fans React

అఫ్రిదితో పోలిక ఎందుకు?
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన పవర్-హిట్టర్‌గా గుర్తింపు పొందాడు. కేవలం 16 ఏళ్ల వయసులోనే శ్రీలంకపై 37 బంతుల్లోనే అప్పట్లోనే అత్యంత వేగవంతమైన వన్డే సెంచరీ బాది ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు అదే తరహా దూకుడు, నిర్భయత్వం 15 ఏళ్ల వైభవ్‌లో కనిపిస్తోంది. ముల్లాన్‌పూర్ మైదానంలో దిగ్గజ బౌలర్లను కూడా ముప్పుతిప్పలు పెట్టిన వైభవ్ ఆట తీరు పాక్ దిగ్గజాలకు అఫ్రిది తొలి రోజులను గుర్తుకు తెచ్చింది. కానీ భారత అభిమానులు ఈ పోలికను జీర్ణించుకోలేకపోతున్నారు.

గేల్ తర్వాత యూసుఫ్ కూడా దాసోహం
ఈ చారిత్రాత్మక ఇన్నింగ్స్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ లెజెండ్స్ వైభవ్ ప్రతిభకు తలవంచుతున్నారు. అంతకుముందు టీ20 క్రికెట్ 'యూనివర్స్ బాస్' క్రిస్ గేల్ కూడా వైభవ్‌ను 'న్యూ సిక్స్ మెషిన్', 'యూనివర్సల్ బేబీ బాస్' అని కొనియాడారు. ఇప్పుడు మహమ్మద్ యూసుఫ్ కూడా ప్రశంసించడంతో, పెద్ద పెద్ద బ్యాటర్లు తమ సుదీర్ఘ కెరీర్‌లో సాధించలేని గుర్తింపును వైభవ్ కేవలం 15 ఏళ్ల వయసులోనే సాధించాడని స్పష్టమవుతోంది. భవిష్యత్తులో ఈ కుర్రాడు పాకిస్థాన్ బౌలర్లకు సింహస్వప్నంగా మారడం ఖాయమని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.

Story first published: Friday, May 29, 2026, 10:54 [IST]
Other articles published on May 29, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+