For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బుడ్డోడి దెబ్బకు వాటర్ పైప్ పగిలిందిపో! (వీడియో)

Vaibhav Suryavanshi: క్రికెట్ ప్రపంచంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒకే పేరు మార్మోగిపోతోంది.. అది మరెవరో కాదు భారత యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ. భారత అండర్-19 జట్టులో తనదైన ముద్ర వేసిన ఈ కుర్రాడు.. క్రీజులోకి వచ్చాడంటే చాలు బౌలర్లకు చుక్కలు చూపించడం ఖాయం. పవర్ హిట్టింగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిన వైభవ్ సూర్యవంశీ.. ప్రస్తుతం ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరపున ప్రాక్టీస్ సెషన్లలో బిజీగా ఉన్నాడు. అయితే తాజాగా జరిగిన ఒక ప్రాక్టీస్ సెషన్‌లో వైభవ్ కొట్టిన ఒక షాట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వాటర్ పైప్ పగిలేలా పవర్ హిట్టింగ్!
రాజస్థాన్ రాయల్స్ నెట్స్ ప్రాక్టీస్‌లో భాగంగా వైభవ్ సూర్యవంశీ ఒక బంతిని ఎంత బలంగా బాదాడంటే.. ఆ బంతి వాయువేగంతో వెళ్లి నేరుగా అక్కడ ఉన్న వాటర్ పైపును ఢీకొట్టింది. ఆ దెబ్బకు పైప్ కాస్తా పగిలిపోయింది. ఈ వీడియోను రాజస్థాన్ రాయల్స్ తన అధికారిక 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేస్తూ.. "సూర్యవంశీ మాత్రమే ఇలా చేయగలడు" అని స్మైలీ ఎమోజీని జత చేసింది. ఈ టీనేజర్ హిట్టింగ్ పవర్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. నెట్స్‌లోనే ఇలా ఉంటే, ఇక మ్యాచ్‌ల్లో బంతి స్టేడియం అవతల పడటం ఖాయమని కామెంట్స్ చేస్తున్నారు.

Vaibhav Suryavanshi Breaks Water Pipe During Rajasthan Royals Practice Teenage Sensation Viral

ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన బుడ్డోడు
వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్‌లో అడుగుపెట్టినప్పటి నుంచే రికార్డుల వేట మొదలుపెట్టాడు. కేవలం 14 ఏళ్ల ప్రాయంలోనే ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచిన ఈ బీహార్ కుర్రాడు.. తన మూడో మ్యాచ్‌లోనే విశ్వరూపం చూపించాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 38 బంతుల్లోనే 101 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. ఇందులో 7 ఫోర్లు, ఏకంగా 11 సిక్సర్లు ఉండటం విశేషం. కేవలం 35 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి, టీ20 ఫార్మాట్‌లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా, ఐపీఎల్‌లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ వీరుడిగా రికార్డులకెక్కాడు.

అండర్-19 వరల్డ్ కప్‌లో భారత్‌ను విజేతగా నిలిపి..
కేవలం ఐపీఎల్‌లోనే కాదు.. ఇటీవల జరిగిన అండర్-19 వరల్డ్ కప్‌లోనూ వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శన చేశాడు. హరారేలో ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 175 పరుగుల భారీ ఇన్నింగ్స్‌తో భారత్ 100 పరుగుల తేడాతో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో సెంచరీ చేసిన యంగెస్ట్ క్రికెటర్‌గా నిలవడమే కాకుండా, వరల్డ్ కప్ ఫైనల్ చరిత్రలో 55 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకుని రెండో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా ఘనత సాధించాడు.

Story first published: Friday, February 20, 2026, 18:58 [IST]
Other articles published on Feb 20, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+