Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో లేని రికార్డు.. సెహ్వాగ్-గంభీర్‌లనే వెనక్కి నెట్టిన బుడ్డోడు!

ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్‌తో ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. తన అరంగేట్ర మ్యాచ్‌లోనే మెరుపు హాఫ్ సెంచరీతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ 15 ఏళ్ల కుర్రాడు.. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో కేవలం 18 బంతుల్లోనే 31 పరుగులు చేసి మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్ ద్వారా భారత దిగ్గజ ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ పేరిట ఉన్న 18 ఏళ్ల నాటి రికార్డును వైభవ్ సూర్యవంశీ బ్రేక్ చేశాడు.

సరికొత్త చరిత్ర సృష్టించిన వైభవ్
గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో మహ్మద్ సిరాజ్ వేసిన మొదటి ఓవర్ రెండో బంతికే ఫోర్ బాదడం ద్వారా వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర లిఖించాడు. ఈ ఫోర్‌తో వైభవ్ సూర్యవంశీ, యశస్వీ జైస్వాల్ జోడీ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా 500 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసిన ఓపెనింగ్ జోడీగా నిలిచింది. గతంలో 2008లో ఢిల్లీ డేర్‌డెవిల్స్(ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్) తరఫున వీరేంద్ర సెహ్వాగ్-గౌతమ్ గంభీర్ జోడీ 309 బంతుల్లో 500 పరుగులు పూర్తి చేయగా.. వైభవ్-జైస్వాల్ జంట కేవలం 248 బంతుల్లోనే ఈ మైలురాయిని అందుకోవడం విశేషం.

Vaibhav Suryavanshi Breaks Sehwag-Gambhir 18-Year-Old IPL Record RR vs GT Highlights

పరిణతిని చాటుకున్న వైభవ్ సూర్యవంశీ
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ పోరులో వైభవ్ సూర్యవంశీ తన పరిణతిని చాటుకున్నాడు. మొదట్లో కాస్త నెమ్మదిగా ఆడి డిఫెన్సివ్ టెక్నిక్‌తో ఆకట్టుకున్న ఈ వండర్ బాయ్.. ఆ తర్వాత 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో విరుచుకుపడ్డాడు. మరోవైపు యశస్వీ జైస్వాల్ తన దూకుడును కొనసాగించగా.. వీరిద్దరూ కలిసి పవర్ ప్లేను పూర్తిస్థాయిలో వాడుకుని 6.2 ఓవర్లలోనే 70 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఓ టీనేజర్, ఓ యువ ఆటగాడు కలిసి సృష్టించిన ఈ రికార్డును భవిష్యత్తులో దిగ్గజ ఆటగాళ్లు కూడా అధిగమించడం కష్టమనే చెప్పాలి.

మ్యాచ్ పరిస్థితి ఇలా..
వైభవ్ సూర్యవంశీ, యశస్వీ జైస్వాల్ అందించిన ఈ బలమైన పునాదితో రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనలో గుజరాత్ టైటాన్స్ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ.. నిర్ణీత ఓవర్లలో 204 పరుగులకే పరిమితమైంది. దీంతో రాజస్థాన్ రాయల్స్ ఈ ఉత్కంఠభరిత పోరులో విజయం సాధించడమే కాకుండా పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంది.

Story first published: Sunday, April 5, 2026, 12:06 [IST]
Other articles published on Apr 5, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+