Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బుడ్డోడి ఖాతాలో రూ.12 కోట్ల భారీ ఆఫర్?

భారత క్రికెట్‌లో 15 ఏళ్ల యవ సంచలనం వైభవ్ సూర్యవంశీ దశ తిరిగింది. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్లో తన అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఈ 'బేబీ మాన్‌స్టర్' వైపు ఇప్పుడు కార్పొరేట్ దిగ్గజాలు క్యూ కడుతున్నాయి. మైదానంలో ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడే ఈ యువ బ్యాటర్, ఇప్పుడు బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ మార్కెట్లోనూ కోట్లలో ఆఫర్లను సొంతం చేసుకుంటూ సరికొత్త రికార్డుల వైపు దూసుకెళ్తున్నాడు.

ప్రస్తుతం క్రీడా వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. వైభవ్ సూర్యవంశీకి ఓ ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్ నుంచి ఏడాదికి ఏకంగా రూ.12 కోట్ల భారీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ మ్యాచ్‌లు కూడా ఆడకముందే కేవలం 15 ఏళ్ల వయసులోనే ఓ దేశవాళీ క్రికెటర్‌కు ఈ స్థాయి ఆఫర్ రావడం భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదైన విషయంగా చెబుతున్నారు. వైభవ్ సూర్యవంశీ బ్యాండ్ వాల్యూ రాత్రికి రాత్రే పెరిగిపోవడంతో పలు కార్పొరేట్ కంపెనీలు అతనితో దీర్ఘకాలిక ఒప్పందాలు కుదుర్చుకోవడానికి పోటీ పడుతున్నాయి.

Vaibhav Suryavanshi Brand Value IPL Star Gets Rs 12 Crore Offer Before International Debut

ఇప్పటివరకు ఉన్న వివరాల ప్రకారం.. ఈ యువ సంచలనానికి బ్యాట్ స్పాన్సర్‌షిప్ కింద ఏడాదికి రూ.50 లక్షల వరకు ఆదాయం వస్తోంది. అయితే ఐపీఎల్‌లో వైభవ్ చూపించిన ఇంపాక్ట్.. తాజాగా ఆసియా క్రీడల 2026 జట్టులో చోటు దక్కించుకోవడంతో వైభవ్ క్రేజ్ స్కై రాకెట్‌లా దూసుకెళ్లింది. ఈ క్రమంలోనే ప్రముఖ టైర్ బ్రాండ్ కంపెనీలు కూడా తమ బ్రాండ్ అంబాసిడర్‌గా వైభవ్‌ను నియమించుకోవడానికి భారీ ఆఫర్లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్ నడుస్తోంది. సాధారణంగా సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజాల బ్యాట్లపై కనిపించే టైర్ బ్రాండ్ లోగోలు, ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ బ్యాట్‌పై కూడా కనిపించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

స్టేడియం బయట కూడా వైభవ్ సూర్యవంశీ క్రేజ్ అప్పుడే మొదలైపోయింది. ఇప్పటికే ఒక ప్రముఖ న్యూట్రిషనల్ హెల్త్ డ్రింక్ యాడ్‌లో నటిస్తూ టీవీ స్క్రీన్లపై మెరుస్తున్నాడు. చిన్న వయసులోనే ఫిట్‌నెస్, అగ్రెసివ్ ఆటతీరుతో యువతకు రోల్ మోడల్‌గా మారుతుండటంతో హెల్త్, ఎనర్జీ డ్రింక్ బ్రాండ్లు అతనికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఆసియా క్రీడలతో పాటు భారత్-ఏ జట్టు తరఫున వైభవ్ సూర్యవంశీ కనుక రాణిస్తే, అతని బ్రాండ్ వాల్యూ మరిన్ని కోట్లకు చేరడం ఖాయమని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Story first published: Sunday, May 31, 2026, 8:26 [IST]
Other articles published on May 31, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+