Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వైభవ్ బ్యాట్‌లో ‘ఏఐ చిప్’?

భారత క్రికెట్‌లో మరో ధ్రువతార ఉదయించింది. కేవలం 15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ వంటి ప్రపంచ స్థాయి లీగ్‌లో దిగ్గజ బౌలర్లను వణికిస్తున్న వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాడు. ఇటీవల సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 36 బంతుల్లోనే సెంచరీ బాది అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభను ఆశ్చర్యపోవాలో లేక ఓర్వలేకనో తెలియదు కానీ.. పాకిస్థాన్ క్రికెట్ నిపుణుడు నౌమాన్ నియాజ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.

పాకిస్థాన్ ఎక్స్‌పర్ట్ వింత ఆరోపణలు!
ఓ పాకిస్థానీ టీవో షోలో నౌమాన్ నియాజ్ మాట్లాడుతూ.. వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్‌పై విస్మయం వ్యక్తం చేస్తూనే కొన్ని అసంబద్ధమైన ఆరోపణలు చేశారు. "ఈ పిల్లాడు అసలు మనిషేనా? అతని బ్యాట్‌ను ఒకసారి ల్యాబ్‌కు పంపించి పరీక్షించాలి. డోపింగ్ టెస్టులు చేసినట్లుగా బ్యాట్‌ను కూడా చెక్ చేయాలి. బహుశా అతను తన బ్యాట్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చిప్ వాడుతున్నాడేమో అనిపిస్తోంది. అతని ఆటతీరు చూస్తుంటే అది సహజమైన ప్లేయర్ లా కాకుండా ప్రోగ్రామ్ చేసిన రోబోలా ఉంది" అని నౌమాన్ నియాజ్ పేర్కొన్నారు. కేవలం 15 ఏళ్ల వయసులో ఇలాంటి పవర్ హిట్టింగ్ చేయడం నమ్మశక్యంగా లేదని ఆయన వాదించారు.

Vaibhav Suryavanshi AI Chip Controversy Pakistani Expert Slams 15-Year-Old IPL Performance Full Details

టెక్నిక్ చూసి బెంబేలెత్తుతున్న నిపుణులు
వైభవ్ సూర్యవంశీ శారీరక ధృడత్వం కంటే అతని టెక్నిక్ అద్భుతంగా ఉందని నియాజ్ అంగీకరించారు. సాధారణంగా 18 ఏళ్లు నిండిన తర్వాతే క్రీడాకారుల్లో కండరాలు, బలం పెరుగుతాయని.. కానీ 16 ఏళ్లు కూడా నిండని వైభవ్ సూర్యవంశీ ఇంత పవర్‌ఫుల్ షాట్లు ఎలా ఆడుతున్నాడని ఆయన ప్రశ్నించారు. "అతను రిస్టీ ప్లేయర్ మాత్రమే కాదు, గ్రౌండ్ అంతా 360 డిగ్రీల యాంగిల్‌లో షాట్లు ఆడుతున్నాడు. విరాట్ కోహ్లీ వరల్డ్ ఛాంపియన్ అయిన సమయంలో పుట్టిన ఈ కుర్రాడు.. తన టెక్నిక్‌తో ప్రపంచాన్ని శాసిస్తున్నాడు" అని ప్రశంసిస్తూనే తన అనుమానాలను వ్యక్తం చేశారు.

రికార్డుల సునామీ.. వైభవ్ సూర్యవంశీ
వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026లో తిరుగులేని ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన వైభవ్ ఏకంగా 234.87 స్ట్రైక్ రేట్‌తో 357 పరుగులు సాధించాడు. ఇందులో ఓ సెంచరీతో పాటు రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గతేడాది గుజరాత్ టైటాన్స్‌పై 35 బంతుల్లోనే సెంచరీ చేసి ఐపీఎల్ చరిత్రలో రెండో వేగవంతమైన శతకాన్ని నమోదు చేసిన వైభవ్.. ఈ ఏడాది హైదరాబాద్‌పై 36 బంతుల్లోనే సెంచరీ బాది తన రికార్డును పదిలం చేసుకున్నాడు.

పాక్ కుట్రలపై నెటిజన్ల కౌంటర్
పాకిస్థాన్ నిపుణుడు చేసిన ఈ 'ఏఐ చిప్' కామెంట్లపై భారత క్రికెట్ అభిమానులు ఘాటుగా స్పందిస్తున్నారు. భారత యువ ఆటగాళ్ల ఎదుగుదలను చూసి ఓర్వలేక పాకిస్థానీలు ఇలాంటి పిచ్చి ఆరోపణలు చేస్తున్నారని మండిపడుతున్నారు. గతంలో మహమ్మద్ షమీ బౌలింగ్‌లో వాడే బంతిలో చిప్ ఉందని ఆరోపించిన విషయాన్ని నెటిజన్లు గుర్తు చేస్తూ.. "పాకిస్థానీలకు ఓటమిని తట్టుకోవడం కంటే కుట్ర సిద్ధాంతాలు అల్లడం అలవాటుగా మారింది" అని ఎద్దేవా చేస్తున్నారు. వైభవ్ తన సహజ సిద్ధమైన ప్రతిభతోనే రాణిస్తున్నాడని, ఇలాంటి కామెంట్స్ అతని ఆత్మవిశ్వాసాన్ని ఏమాత్రం దెబ్బతీయలేవని అభిమానులు స్పష్టం చేస్తున్నారు.

Story first published: Monday, April 27, 2026, 14:46 [IST]
Other articles published on Apr 27, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+