Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్రికెట్‌లో ఏజ్ ఫ్రాడ్.. విజేందర్ సింగ్ ట్వీట్ వివాదం

IPL 2025: 14 ఏళ్ల వయస్సులోనే 35 బంతుల్లోనే శతకం బాది అతిపిన్న వయస్సులోనే సెంచరీ చేసిన భారతీయ ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ రికార్డును సాధించాడు. అనంతరం అతడి వయస్సుపై చాలా మంది కామెంట్లు చేశారు. అతడి 14 కంటే ఎక్కువగానే ఉంటుందని.. కానీ తక్కువగా చూపిస్తున్నాడని విమర్శలు గుప్పించారు. తాజాగా క్రికెటర్లు తక్కువ వయస్సును చూపి ఆడుతున్నారని భారత మాజీ బాక్సర్ విజేందర్ సింగ్ చేసిన ట్వీట్ వివాదం అవుతోంది. ఆయన ఐపీఎల్ స్టార్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి టార్గెట్ చేసి ఉంటారని నెటిజన్లు భావిస్తున్నారు. ఈ అంశంపై నెట్టింట చర్చ జరుగుతోంది. 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ బీహార్ కుర్రాడు 35 బంతుల్లో సెంచరీ కొట్టి రికార్డులకెక్కాడు.

Vaibhav Suryavanshi Age Controversy Vijender Singh s Tweet Sparks IPL 2025 Debate

తాజాగా బాక్సర్ విజేందర్ సింగ్ తన ట్వీట్ లో క్రికెటర్లను విమర్శించాడు. కొంత మంది క్రికెటర్లు వయస్సు తక్కువ చెప్పి ఆడుతున్నారని తన ట్వీట్ లో వ్యాఖ్యాన్నించాడు. అయితే విజేందర్ చేసిన ట్వీట్ లో ఎవరి గురించి ఆ మాట అన్నాడో సూటిగా లేదు. కాకపోతే వైభవ్ సూర్యవంశీ గురించి ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారని నెటిజన్లు భావిస్తున్నారు. ఇటీవల వైభవ్ సూర్యవంశీ వయస్సుపై అనుమానాలు వ్యక్తం కావడంతో చాలా మంది సోషల్ మీడియాలో వైభవ్ కు సంబంధించి పాత వీడియోలను పంచుకున్నారు. ఆ వీడియోలలో వైభవ్ వయస్సు కన్నా ఎక్కువ ఏజ్ లో ఉన్నట్లు కనిపించాడు.

Story first published: Thursday, May 1, 2025, 18:44 [IST]
Other articles published on May 1, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+