Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Vaibhav Suryavanshi: సిక్సర్ల పిడుగు.. పదేళ్ల వయస్సులోనే 90 మీటర్ల సిక్స్ కొట్టాడు..

Vaibhav Suryavanshi: ఐపీఎల్ 2025లో వైభవ్ సూర్యవంశీ 35 బంతుల్లో సెంచరీ కొట్టడం ద్వారా అనేక రికార్డులను బద్దలు కొట్టగా.. వైభవ్ చిన్ననాటి కోచ్ మనీష్ ఓజా అతనికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను చెప్పాడు. బ్రియాన్ లారాకు వీరాభిమాని అయిన వైభవ్ సూర్యవంశీలో నమ్మశక్యం కాని సిక్స్ హిట్టింగ్ ప్రతిభ ఉందని తెలిపాడు. వైభవ్ ప్రతిభ ముందు ఈ శతకం చాలా చిన్నదని.. అతను పదేళ్ల వయస్సులోనే 90 మీటర్ల భారీ సిక్సర్లు బాదే వాడని.. రోజూ నెట్స్ లో 350 నుంచి 400 బంతులు ఎదుర్కొనేవాడని మనీష్ ఓజా వెల్లడించాడు. వైభవ్ సూర్యవంశీకి శిక్షణ ఇస్తున్న సమయంలో ఒక్కసారి కూడా తిట్టాల్సిన అవసరం రాలేదని అన్నాడు. అతడికి ఏ షాట్ నేర్పించినా, ఏ టెక్నిక్ ను వివరించినా దాన్ని పునరావృతం చేయాల్సిన అవసరం రాలేదని చెప్పాడు.

మనీష్ ఓజా మాట్లాడుతూ.. "నేను వైభవ్ సూర్యవంశీని మొదటిసారి 2018లో కలిశాను. వైభవ్, అతని తండ్రి మొదటి రోజు నా శిక్షణ కేంద్రానికి వచ్చినప్పుడు నేను అక్కడ లేను. కాబట్టి నేను వారిని స్వయంగా కలవలేదు. ఒక వారం తర్వాత వారు నన్ను కలవడానికి వచ్చారు. "అని మనీష్ ఓజా చెప్పుకొచ్చాడు. "నేను 2022లో మా శిక్షణా కేంద్రంలో ఒక మ్యాచ్ నిర్వహించాను. మా శిక్షణా కేంద్రం నుంచి ఆటగాళ్ళు బీహార్ రాష్ట్ర స్థాయి అండర్-19 ఆటగాళ్లతో ఆడారు. 10 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఆ మ్యాచ్‌లో 118 పరుగులు చేశాడు. మీరు ఇప్పుడు చూస్తున్న సిక్సర్లు వైభవ్ అప్పుడే బాదాడు." అని చెప్పాడు.

Vaibhav Suryavanshi 90meters Six at Age 10 Coach Reveals Shocking Talent

ఆ సమయంలో బౌండరీ 60 నుంచి 65 మీటర్ల దూరంలో ఉందని.. కానీ వైభవ్ సూర్యవంశీ కొట్టిన సిక్సర్లు బౌండరీ లైన్ దాటి 20 నుంచి 30 మీటర్లు వెళ్లాయన్నారు. వైభవ్ హిట్ల వేగం, సమయం, ఖచ్చితత్వం అన్నీ అద్భుతంగా ఉన్నాయని అన్నాడు. ఈ బాలుడు అసాధారణమైనవాడని అప్పుడే అర్థం చేసుకున్నామన్నారు.

14 ఏళ్ల వయస్సులో అంత శక్తిని ఎలా పొందాడని అని అడిగిన ప్రశ్నకు మనీష్ ఓజా సమాధానమిచ్చాడు. అది సాధ్యమేనని.. బలంగా కొట్టడానికి ముందుగా ఆత్మవిశ్వాసం ముఖ్యమైనది అంటూ చెప్పుకొచ్చాడు. వైభవ్ భారీ సిక్సర్లు కొట్టే ప్రయత్నం చేయబట్టి నాలుగేళ్లు అవుతోందన్నాడు. అదే కాన్ఫిడెన్స్ తో వైభవ్ భారీ షాట్లు ఆడతాడన్నాడు. వైభవ్ కు ఈ స్థాయి హిట్టింగ్ సామర్థ్యం రావడానికి కారణం అతడి కఠోర ప్రాక్టీస్ అంటూ చెప్పుకొచ్చాడు. వైభవ్‌కు ప్రాక్టీస్ లో రోబోలతో త్రోలు వేయించేవాడినని మనీష్ ఓజా తెలిపాడు. వైభవ్ టైమింగ్, టెక్నిక్ కూడా అద్భుతంగా ఉంటుందన్నాడు. ఈ రికార్డు సెంచరీకి ముందు రోజు వైభవ్‌తో మాట్లాడినట్లు వైభవ్ ఓజా వెల్లడించాడు.

చాలా చిన్నవయసులో వైభవ్ సూర్యవంశీ రోజుకు 350 నుంచి 400 బంతులు ఎదుర్కొనేవాడని.. ఫ్రంట్ ఫుట్ డ్రైవ్, లాఫ్టెడ్ షాట్, స్టెప్ అవుట్ డ్రైవ్, కట్ షాట్, పుల్ షాట్ వంటి ప్రాథమిక బ్యాటింగ్ కసరత్తులను ప్రాక్టీస్ చేయమని తాను అతడికి చెప్పేవాడినని మనీష్ ఓజా తెలిపాడు. కాగా.. ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ 35 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి ఐపీఎల్ లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన భారత ఆటగాడిగా రికార్డులు నెలకొల్పాడు.

Story first published: Tuesday, April 29, 2025, 17:30 [IST]
Other articles published on Apr 29, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+