Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బుడ్డోడికి రూ.30 కోట్ల ఆఫర్!

ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సృష్టిస్తున్న విధ్వంసానికి క్రికెట్ ప్రపంచం నోరెళ్లబెడుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన కీలక ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఈ కుర్రాడు ఆడిన మెరుపు ఇన్నింగ్స్ వైభవ్ సూర్యవంశీ బ్రాండ్ వాల్యూను ఒక్కసారిగా ఆకాశానికి చేర్చింది. భవిష్యత్తులో వైభవ్ కనుక మెగా వేలంలోకి వస్తే కనీసం రూ.30 కోట్ల రూపాయల బిడ్ పలకడం ఖాయమని భారత మాజీ దిగ్గజాలు వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డారు. కేవలం రూ.1.10 కోట్ల బేస్ ధరకు రాజస్థాన్ సొంతం చేసుకున్న ఈ యువ సంచలనం.. ఇప్పుడు లీగ్‌లోనే మోస్ట్ వాంటెడ్ ప్లేయర్‌గా మారిపోయాడు.

కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. ఎలిమినేటర్‌లో ఊచకోత

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన నాకౌట్ పోరులో వైభవ్ సూర్యవంశీ ఆరంభం నుంచే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీలలో ఒకటిగా నమోదు చేశాడు. మొత్తంగా 29 బంతులు ఎదుర్కొన్న వైభవ్ 97 పరుగుల వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 47 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి క్వాలిఫైయర్-2కు దూసుకెళ్లింది. అక్కడ మే 29న క్వాలిఫైయర్-2 పోరులో రాజస్థాన్ రాయల్స్ జట్టు గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది.

Vaibhav Sooryavanshi Worth Rs 30 Crore in IPL Auction Virender Sehwag Harbhajan Singh and ABD in Awe IPL 2026 Vaibhav Suryavanshi Shines In IPL 2026 With Notable Innings And Bid Buzz

క్రిస్ గేల్ ఆల్-టైమ్ సిక్సర్ల రికార్డ్ బ్రేక్

ఈ మ్యాచ్‌కు ముందు వైభవ్ సూర్యవంశీ ఖాతాలో 53 సిక్సర్లు ఉన్నాయి. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఆడిన మెరుపు ఇన్నింగ్స్‌లో వైభవ్ సూర్యవంశీ ఏకంగా 12 సూపర్ సిక్సర్లు బాదాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన 'యూనివర్స్ బాస్' క్రిస్ గేల్ (59 సిక్సర్లు) రికార్డును వైభవ్ అధిగమించాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే వెస్టిండీస్ లెజెండ్ రికార్డును బద్దలు కొట్టడం వైభవ్ అసాధారణ హిట్టింగ్ సామర్థ్యానికి అద్దం పడుతోంది.

లైవ్ కామెంటరీలో సెహ్వాగ్, ఆకాష్ చోప్రా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

వైభవ్ సిక్సర్ల వర్షం కురిపిస్తున్న సమయంలో లైవ్ కామెంటరీ బాక్స్‌లో ఉన్న హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్‌ను ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగాడు. "ఈ కుర్రాడు కనుక వేలంలోకి వస్తే నువ్వు ఎంత ధర ఇస్తావు వీరూ?" అని భజ్జీ అడగ్గా.. సెహ్వాగ్ ఏమాత్రం ఆలోచించకుండా "నేనైతే కచ్చితంగా రూ.30 కోట్లు పెడతాను" అని సమాధానమిచ్చాడు. దీనికి తోటి కామెంటేటర్ ఆకాష్ చోప్రా కూడా స్పందిస్తూ.. తాను కూడా వైభవ్ కోసం రూ.30 కోట్ల భారీ మొత్తాన్ని కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పడం విశేషం.

ఆరెంజ్ క్యాప్‌తో వైభవ్ సూర్యవంశీ సరికొత్త రికార్డు

ఐపీఎల్ 2026 సీజన్ వైభవ్ సూర్యవంశీ నామ సంవత్సరంగా మారిపోయింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 15 మ్యాచ్‌లు ఆడిన వైభవ్.. ఏకంగా 45.33 అద్భుతమైన సగటుతో, 242.86 అంతకంటే భయంకరమైన స్ట్రైక్ రేట్‌తో 680 పరుగులు సాధించాడు. ఈ అద్భుత రికార్డుతో అతను ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచి ప్రతిష్టాత్మక 'ఆరెంజ్ క్యాప్'ను తన సొంతం చేసుకున్నాడు. ఇంత చిన్న వయసులో ఆరెంజ్ క్యాప్ అందుకోవడం క్రికెట్ చరిత్రలోనే అపూర్వ ఘట్టం.

ఏబీ డివిలియర్స్ ప్రశంసల జల్లు: 'ఆ వయసు.. ఆ మెచ్యూరిటీ అద్భుతం’

దక్షిణాఫ్రికా మాజీ బ్యాటర్, ఐపీఎల్ లెజెండ్ ఏబీ డివిలియర్స్ కూడా వైభవ్ సూర్యవంశీ ప్రతిభకు ముగ్ధుడైపోయాడు. జియోస్టార్ (JioStar) నెట్‌వర్క్‌తో మాట్లాడిన డివిలియర్స్, 15 ఏళ్ల వయసులోనే వైభవ్‌కు మ్యాచ్‌పై ఉన్న అవగాహన తనను ఎంతగానో ఆశ్చర్యపరిచిందని కొనియాడారు. "వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్‌లో అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే, అతను కేవలం 15 సంవత్సరాల వయస్సులో ఒంటిచేత్తో మ్యాచ్ తిప్పడమే కాకుండా, విపరీతమైన ఒత్తిడిలో కూడా అద్భుతమైన సంయమనం, స్పష్టతను ప్రదర్శించాడు. ప్యాట్ కమిన్స్ వంటి వరల్డ్ క్లాస్ కెప్టెన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ వైభవ్ ఫామ్‌ను దెబ్బతీయడానికి ఫీల్డింగ్ వ్యూహాలు, బౌలింగ్ లెంగ్త్‌లను పదే పదే మార్చినా, అతను దేనికీ లొంగకుండా తన ఆటపైనే దృష్టి కేంద్రీకరించాడు. ఇంత తక్కువ వయస్సులో ఒక నాకౌట్ మ్యాచ్‌లో ఈ స్థాయి అవగాహన చూపించడం ఎంతగానో ప్రశంసనీయం" అని మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ కొనియాడారు.

Story first published: Friday, May 29, 2026, 15:02 [IST]
Other articles published on May 29, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+