Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

దీపావళి లేదు, సెలవుల్లేవ్.. బుడ్డోడి క్రికెట్ పిచ్చి వెనుక అసలు స్టోరీ!

ఐపీఎల్ 2026లో అద్భుతాలు సృష్టించిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం భారత క్రికెట్లో హాట్ టాపిక్‌గా మారాడు. టోర్నీలో ఏకంగా 776 పరుగులు, 72 సిక్సర్లు బాది ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న ఆ యువ సంచలనమే వైభవ్ సూర్యవంశీ. ప్రపంచ స్థాయి బౌలర్లు కూడా బ్యాటింగ్ ముందు చేతులెత్తేశారు. అయితే ప్రపంచం వైభవ్ సూర్యవంశీ సాధించిన విజయాన్ని.. అతని తలపై ఉన్న ఆరెంజ్ క్యాప్‌ను మాత్రమే చూసింది. కానీ ఈ రికార్డుల వెనుక ఉన్న కఠోర శ్రమ, క్రమశిక్షణ, క్రికెట్ కోసం వైభవ్ చేసిన త్యాగాల గురించి రాజస్థాన్ రాయల్స్ టీమ్ మేనేజర్ రోమి భిందర్ మొదటిసారి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో అండర్-19 ప్రపంచ కప్ ముగిసిన అనంతరం టోర్నీ ఆడి అలసిపోయిన ఆటగాళ్లంతా తమ కుటుంబాలతో గడపడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చారు. రోమి భిందర్ కూడా వైభవ్ సూర్యవంశీ గురించి అలాగే అనుకున్నారు. కానీ వైభవ్ సూర్యవంశీ జింబాబ్వే నుంచి ముంబై చేరుకోగానే అందరినీ ఆశ్చర్యపరుస్తూ.. "నేను పిచ్‌కు వెళ్లాలి, ప్రాక్టీస్ చేయాలి" అని వైభవ్ అడిగాడు. 'రెండు మూడు రోజులు విశ్రాంతి తీసుకో' అని మేనేజర్ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా.. 'కనీసం ఒక అరగంటైనా నెట్స్‌లో గడుపుతాను' అంటూ వైభవ్ సూర్యవంశీ నవ్వుతూ సమాధానమిచ్చాడు. ఆ అంకితభావమే వైభవ్‌ను తదుపరి లక్ష్యం వైపు నడిపించింది.

Vaibhav Sooryavanshi The inspiring story behind IPL 2026 Orange Cap winner success Details

వైభవ్ సూర్యవంశీకి క్రికెట్ పట్ల ఉన్న పిచ్చిని చెప్పడానికి దీపావళి పండుగ నాటి ఓ పెద్ద ఉదాహరణ. దేశమంతా వెలుగుల పండుగను జరుపుకుంటూ కుటుంబాలతో కలిసి మిఠాయిలు తింటూ ఆనందంగా గడుపుతున్న సమయంలో వైభవ్ సూర్యవంశీ మాత్రం ఇంటికి వెళ్లకుండా నెట్స్ బాట పట్టాడు. సమస్తిపూర్‌లో అతని కుటుంబం పండుగ కోసం ఎదురుచూస్తున్నా.. వైభవ్ మాత్రం తన పండుగను ట్రైనింగ్ గ్రౌండ్‌లోనే గడిపాడు. 15 ఏళ్ల వయసులో ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం అంత సులభం కాదు. కానీ ఓ సాధారణ ఆటగాడికి, అసాధారణ ఆటగాడికి మధ్య ఉండే తేడా ఇదేనని వైభవ్ నిర్ణయం నిరూపించింది.

ప్రపంచమంతా ఐపీఎల్‌లో వైభవ్ సూర్యవంశీ సిక్సర్లు, పరుగులు లెక్కబెడుతుంటే.. వైభవ్ సూర్యవంశీ మాత్రం నెట్స్‌లో తను గడిపిన గంటలను లెక్కబెట్టుకున్నాడు. మిగతా ఆటగాళ్లు సెలవులు ఎంజాయ్ చేస్తున్నప్పుడు.. వైభవ్ సూర్యవంశీ లైట్లు వేయించుకుని మరీ అర్ధరాత్రి వరకు ప్రాక్టీస్ చేసేవాడు. అందుకే రోమి భిందర్ పూర్తి నమ్మకంతో వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తులో ఓ గొప్ప ఆటగాడు అవుతాడని బలంగా నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. ఈ నమ్మకం కేవలం వైభవ్ సూర్యవంశీ ఆడిన ఇన్నింగ్స్‌ల వల్ల రాలేదు. కెమెరాలు ఆఫ్‌లో ఉన్నప్పుడు వైభవ్ పట్టుదలను, చెమటను మేనేజర్ కళ్లారా చూడటం వల్ల వచ్చింది.

ఇటీవల ఐర్లాండ్ పర్యటనలో వైభవ్ సూర్యవంశీకి అవకాశం దక్కలేదు. 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌కు వైభవ్ సిద్ధంగా ఉన్నాడా లేదా అనే చర్చలు కూడా నడిచాయి. కానీ వరల్డ్ కప్ ముగిసిన మరుసటి రోజే నెట్స్‌లోకి వచ్చే ఆటగాడు, దీపావళి సెలవులను కూడా శిక్షణకే అంకితం చేసిన క్రికెటర్, ఐపీఎల్‌లో ప్రపంచ అత్యుత్తమ బౌలర్లను ఎదిరించి ఆరెంజ్ క్యాప్ సాధించిన 'బేబీ బాస్' సన్నద్ధతపై ఇంకా అనుమానాలు అవసరమా? త్వరలో జరగబోయే ఇంగ్లాండ్ సిరీస్‌కు ముందు ఈ ప్రశ్న భారత టీమ్ మేనేజ్‌మెంట్ ముందు నిలిచింది. స్టేడియం ఖాళీగా ఉన్నప్పుడు, కెమెరాలు లేనప్పుడు పిచ్‌పై ఒంటరిగా పోరాడిన ఆ కుర్రాడి అసలైన ఆట ఇప్పుడు దేశం కోసం మొదలుకానుంది.

Story first published: Wednesday, July 1, 2026, 13:07 [IST]
Other articles published on Jul 1, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+