కార్టూన్లు చూస్తా.. బౌలర్లను ఉతికేస్తా! చిన్నోడి ‘భోజ్‌పురి’ రచ్చ!! (వీడియో)
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్‌తోనే కాకుండా తన మాటలతోనూ నెటిజన్ల మనసు గెలుచుకుంటున్నాడు. బీహార్లోని సమస్తిపూర్ జిల్లాకు చెందిన ఈ వండర్ బాయ్ దిగ్గజ బౌలర్లను కూడా భయపెడుతూ ఈ సీజన్లో దూసుకుపోతున్నాడు. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ కేవలం 8 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచినప్పటికీ.. మ్యాచ్ అనంతరం అతను మాట్లాడిన భోజ్‌పురి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
భోజ్‌పురి భాషలో అదిరిపోయే ప్లాన్
మ్యాచ్ ముగిసిన తర్వాత బ్రాడ్‌కాస్టర్లతో మాట్లాడుతూ వైభవ్ సూర్యవంశీ తన అచ్చమైన భోజ్‌పురి యాసతో అందరినీ ఆకట్టుకున్నాడు. తర్వాతి మ్యాచ్‌ల కోసం మీ ప్లాన్ ఏంటి అని అడగగా.. "ప్లాన్ ఏముంది సార్, మంచిగా ఆడాలి.. తర్వాతి మ్యాచ్‌లో గెలిచి రెండు పాయింట్లు తీసుకుని ప్లేఆఫ్స్ వైపు అడుగులు వేయాలి" అని తన మాతృభాషలో వైభవ్ చెప్పిన తీరుకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఓ చిన్న పిల్లాడిలో ఇంతటి ఆత్మవిశ్వాసం చూడటం ముచ్చటగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

మ్యాచ్‌కు ముందు కార్టూన్లు చూస్తా!
సాధారణంగా ఈ వయసు పిల్లలు కార్టూన్ల లోకంలో ఉంటారు.. కానీ వైభవ్ మాత్రం బౌలర్లను కార్టూన్లుగా మార్చేస్తున్నాడని ప్రెజెంటర్ ప్రశ్నించగా.. వైభవ్ సూర్యవంశీ ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నాడు. "నాకు చిన్నప్పటి నుంచి కార్టూన్లు చూడటం అలవాటు. ఇప్పటికీ ప్రతి మ్యాచ్‌కు ముందు కాసేపు కార్టూన్లు చూస్తాను. అది నా మనసును ప్రశాంతంగా ఉంచుతుంది.. కానీ గ్రౌండ్‌లోకి దిగిన తర్వాత మాత్రం నా పూర్తి ఫోకస్ గేమ్ మీదే ఉంటుంది" అని వైభవ్ సమాధానమిచ్చాడు. ఆటతో పాటు వైభవ్ అమాయకత్వం కూడా అందరినీ అలరిస్తోంది.
విరాట్ కోహ్లీ కంటే ముందే వైభవ్
లక్నోపై తక్కువ స్కోరుకే వైభవ్ సూర్యవంశీ ఔట్ అయినప్పటికీ.. ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో వైభవ్ సూర్యవంశీ టాప్-5లో కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 254 పరుగులు చేసి నాలుగో స్థానంలో ఉన్నాడు. విశేషమేమిటంటే.. రన్ మెషీన్ విరాట్ కోహ్లీ (247 పరుగులు) కంటే వైభవ్ ముందుండటం గమనార్హం. కేవలం 15 ఏళ్ల ప్రాయంలోనే ఐపీఎల్ వంటి భారీ వేదికపై ఇంతటి ప్రతిభ కనబరుస్తున్న ఈ కుర్రాడు భారత క్రికెట్ భవిష్యత్తు ఆశాకిరణంగా కనిపిస్తున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications