టీమిండియా అరంగేట్రం తర్వాత వైభవ్ సూర్యవంశీ తొలి పోస్ట్!
ఇంగ్లాండ్ జట్టుతో శనివారం మాంచెస్టర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. తన అరంగేట్రం తర్వాత సోషల్ మీడియా వేదికగా తొలి పోస్ట్ చేశాడు. ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ.. అంతకు ముందు ఐర్లాండ్ జట్టుతో జరిగిన రెండు టీ20ల్లో, ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో చోటు దక్కకపోవడంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఎట్టేకలకు మాంచెస్టర్ మ్యాచ్‌లో లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వైభవ్ తన తొలి అంతర్జాతీయ ఇన్నింగ్స్‌లో 10 బంతుల్లో 14 పరుగులు చేశాడు.
ఈ మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసినప్పటికీ.. వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం చర్చనీయాంశంగా మారింది. సచిన్ టెండూల్కర్, షఫాలీ వర్మల రికార్డులను బద్ధలు కొడుతూ భారత్ తరఫున అత్యంత పిన్న వయసులో అరంగేట్రం చేసిన ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం వైభవ్ సూర్యవంశీ టీమిండియా జెర్సీలో ఉన్న తన ఫోటోను ఇన్‌స్టా స్టోరీలో షేర్ చూస్తూ.. తన ప్రయాణంలో తనకు అండగా నిలిచిన అభిమానులకు, జట్టు సభ్యులకు, సీనియర్ ఆటగాళ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. దేశానికి ప్రాతినిధ్యం వహించడం ఓ గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు వైభవ్ సూర్యవంశీ పేర్కొన్నాడు.

తన ఇన్‌స్టా స్టోరీలో వైభవ్ ఇలా రాసుకొచ్చాడు. "అందరి నుంచి వస్తున్న సందేశాలు చూసి చాలా ఆనందంగా ఉంది. నా శ్రేయోభిలాషులకు, సీనియర్లకు, నాపై ఎల్లప్పుడూ ప్రేమ చూపిస్తున్న అభిమానులకు నా ధన్యవాదాలు. దేశానికి ప్రాతినిధ్యం వహించే గొప్ప అవకాశం రావడం పట్ల ఎంతో కృతజ్ఞుడనై ఉన్నాను. ప్రతిసారీ నా జట్టు కోసం రాణించడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాను. అందరికీ పేరుపేరున ధన్యవాదాలు" అంటూ వైభవ్ సూర్యవంశీ పేర్కొన్నాడు. వైభవ్ సూర్యవంశీ సాధించిన ఈ రికార్డుపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. వైభవ్ ఉజ్వల భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ(43), ఇషాన్ కిషన్(49) జట్టుకు మంచి స్కోరును అందించగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 37 పరుగులు చేశాడు. చివరలో తిలక్ వర్మ కేవలం 11 బంతుల్లోనే 24 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. చివరి ఓవర్లో తిలక వర్మ ఏకంగా 17 పరుగులు రాబట్టడంతో భారత్ గౌరవప్రదమైన సోకురు చేయగలిగింది. ఇంగ్లాండ్ బౌలర్ సామ్ కరన్ టీమిండియా పరుగుల వేగాన్ని కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు.
అనంతరం 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టుకు ఆరంభంలోనే అర్ష్‌దీప్ సింగ్ షాకిచ్చాడు. ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్‌లను త్వరగానే పెవిలియన్ కు పంపినప్పటికీ.. హ్యారీ బ్రూక్ కేవలం 15 బంతుల్లో 39 పరుగులు చేసి మ్యాచ్‌ను ఇంగ్లాండ్ వైపు తిప్పాడు. హ్యారీ బ్రూక్ ఔట్ అయిన అనంతరం జాకబ్ బెథెల్ బాధ్యతాయుతంగా ఆడి 46 బంతుల్లో అజేయంగా 76 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. టామ్ బాంటన్‌తో కలిసి బెథెల్ 67 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ముఖ్యంగా మ్యాచ్ 17వ టర్నింగ్ పాయింట్‌గా మారింది. లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ ఆ ఓవర్లో రెండు నో బాల్స్‌తో సహా ఏకంగా 29 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ ఓవర్‌తో టీమిండియా ఆశలు పూర్తిగా ఆవిరయ్యాయి. జాకబ్ బెథెల్ మరో ఓవర్ మిగిలి ఉండగానే ఇంగ్లాండ్ జట్టుకు విజయాన్ని అందించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications