తగ్గేదేలే!: నాడు కరాచీలో సచిన్.. నేడు మాంచెస్టర్‌లో వైభవ్!!
ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్డేడియంలో శనివారం వైభవ్ సూర్యవంశీ టీమిండియా జెర్సీ ధరించి అడుగుపెట్టినప్పుడు కోట్లాది మంది అభిమానుల కళ్లు ఈ యువ సంచలనంపైనే ఉన్నాయి. ఇది కేవలం ఓ అరంగేట్రం మాత్రమే కాదు.. వైభవ్ కన్న కలలు నిజమైన క్షణం. టీమిండియా క్యాప్ అందుకునే సమయంలో వైభవ్ సూర్యవంశీ కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ కన్నీళ్ల వెనుక వైభవ్ చిన్ననాటి శ్రమ, కుటుంబ త్యాగాలతో పాటు ఇక్కడి వరకు రావడానికి పడిన కష్టం దాగున్నాయి. కానీ స్టేడియంలోకి వచ్చిన కాసేపటికే వైభవ్ సూర్యవంశీ.. 10 బంతుల్లో 14 పరుగులు చేసి ఇంగ్లీష్ స్పిన్నర్ విల్ జాక్స్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్‌పై కొందరు విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో.. వారంతా ఒకసారి క్రికెట్ హిస్టరీని తిరగేయాల్సిన అవసరం ఉంది.
నాడు సచిన్ కూడా అంతే!
క్రికెట్ దేవుడు అని పిలిచే సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ కెరీర్ ప్రారంభం కూడా చాలా సాధారణంగానే సాగింది. ఈ రోజు సచిన్ టెండూల్కర్ పేరు చెప్పగానే 100 అంతర్జాతీయ సెంచరీలు, 34 వేలకు పైగా రన్స్.. ఎన్నో రికార్డులు కళ్ల ముందు కదలాడుతాయి. కానీ నవంబర్ 15స 1989న కరాచీ వేదికగా పాకిస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 16 ఏళ్ల సచిన్ టెండూల్కర్ తొలిసారి బరిలోకి దిగినప్పుడు పరిస్థితి వేరుగా ఉంది. వసీం అక్రమ్, ఇమ్రాన్ ఖాన్, అబ్దుల్ ఖాదిర్, వకార్ యూనిస్ వంటి దిగ్గజ బౌలర్లను ఎదుర్కొన్న సచిన్ టెండూల్కర్.. తన తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 15 పరుగులు మాత్రమే చేసి వకార్ యూనిస్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. అప్పుడు జట్టు యాజమాన్యం కేవలం ఆ ఒక్క ఇన్నింగ్స్ ఆధారంగానే సచిన్ భవిష్యత్తును తేల్చేసి ఉంటే క్రికెట్ చరిత్ర మరోలా ఉండేది. ఆ తర్వాతి టెస్టులోనే సచిన్ టెండూల్కర్ 59 పరుగులతో రాణించి వెనక్కి తిరిగి చూసుకోలేదు. వైభవ్ సూర్యవంశీ కూడా తన తదుపరి మ్యాచ్‌ల్లో పెద్ద స్కోర్లు సాధిస్తే అతడి ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది.

స్కోరుబోర్డుపై వైభవ్ సూర్యవంశీ చేసినవి 14 పరుగులే కావచ్చు.. కానీ ఆ 10 బంతుల్లోనే వైభవ్ తన క్లాస్ ఏంటో చూపించాడు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బౌలర్ జోఫ్రా ఆర్చర్ వేసిన తొలి బంతినే ఏమాత్రం బెరుకు లేకుండా వైభవ్ సూర్యవంశీ సిక్సర్‌గా మలిచాడు. ఇది కేవలం సిక్స్ మాత్రమే కాదు.. తాను ఏ వేదికపైనా ఒత్తిడికి లోనవ్వననే ఆత్మవిశ్వాసం. అనంతరం అరంగేట్ర బౌలర్ జోష్ టంగ్ ఓవర్లోనూ సిక్సర్ బాదాడు. వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్ చిన్నదే అయినప్పటికీ.. తాను కేవలం ఆడటానికి రాలేదని.. ప్రపంచంలోని బెస్ట్ బౌలర్లపై ఆధిపత్యం చలాయించడానికి వచ్చానని నిరూపించాడు. స్టేడియంలోకి దిగడానికి ముందే 15 ఏళ్ల 99 రోజుల వయసులో భారత్ తరఫున అతి చిన్న వయసులో అరంగేట్రం చేసిన క్రికెటర్ గా సచిన్ 37 ఏళ్ల రికార్డును, అలాగే షఫారీ వర్మ రికార్డును వైభవ్ సూర్యవంశీ బ్రేక్ చేశాడు.
క్రికెట్ హిస్టరీలో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రవిడ్, జాక్వెస్ కలిస్, స్టీవ్ వా వంటి మహామహులవ కెరీర్ ప్రారంభంలోనూ ఇలాంటి వైఫల్యాలు ఎదురయ్యాయి. గొప్ప ప్లేయర్ల గుర్తింపు వారు ఆడిన మొదటి మ్యాచ్‌తో కాకుండా మొదట వైఫల్యం అనంతరం వారు కంబ్యాక్ చేశారనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. వైభవ్ సూర్యవంశీ కూడా రాబోయే కాలంలో ఎలా రాణిస్తాడోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications