రోజుకు ఎన్ని పాలు తాగుతావు: రవిశాస్త్రి ప్రశ్నకు బుడ్డోడి క్రేజీ ఆన్సర్! (వీడియో)
ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగినప్పటికీ.. మ్యాచ్ ముగిసిన అనంతరం ప్రజెంటేషన్ వేడుకలో మాత్రం అభిమానుల దృష్టంతా రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పైనే ఉంది. ఈ సీజన్లో తన అద్భుత బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కులు చూపించిన వైభవ్ సూర్యవంశీ.. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 5 ప్రతిష్టాత్మక అవార్డులను కొల్లగొట్టాడు. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ , ఆరెంజ్ క్యాప్, సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్, మోస్ట్ సిక్సర్స్ అవార్డులను ఈ 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీనే దక్కించుకోవడం విశేషం.
రవిశాస్త్రి సరదా ప్రశ్న.. వైభవ్ అదిరిపోయే కౌంటర్
వైభవ్ సూర్యవంశీ ఒకదాని తర్వాత ఒకటిగా 5 ట్రోఫీలను అందుకోవడానికి స్టేజ్ పైకి వచ్చినప్పుడు.. అక్కడ కామెంటేటర్‌గా ఉన్న టీమిండియా మాజీ దిగ్గజం రవిశాస్త్రి సైతం ఈ చిన్నవయసులోనే వైభవ్ చేస్తున్న పవర్ హిట్టింగ్‌కు ఫిదా అయ్యాడు. వైభవ్ సూర్యవంశీ కొట్టే సిక్సర్ల వెనుక ఉన్న అసలు రహస్యాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో రవిశాస్త్రి సరదాగా ఓ ప్రశ్న వేశాడు. "నువ్వు రోజుకు ఎన్ని పాలు తాగుతావు?" అని రవిశాస్త్రి అడిగాడు. ఈ ఊహించని ఫన్నీ ప్రశ్నకు స్టేడియంలో ఉన్నవారంతా ఒక్కసారిగా నవ్వేశారు. దీనికి 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అంతే అమాయకంగా, నవ్వుతూ.. "నేను ఇప్పుడు పాలు తాగడం లేదు!" అని బదులిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

ఆరెంజ్ గ్యాప్ గెలిచిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు
వైభవ్ సూర్యవంశీ కేవలం 15 ఏళ్ల 65 రోజుల వయసులోనే ఆరెంజ్ క్యాప్ గెలుచుకుని ఐపీఎల్ చరిత్రలోనే ఓ సరికొత్త రికార్డును లిఖించాడు. ఐపీఎల్ చరిత్రలో ఆరెంజ్ క్యాప్ అందుకున్న అత్యంత చిన్న వయస్కుడిగా వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు గుజరాత్ టైటాన్స్ ఆటగాడు సాయి సుదర్శన్ (2025 సీజన్‌లో 23 ఏళ్ల వయసులో) పేరిట ఉండేది. ఈ ఐపీఎల్ 2026 సీజన్లో వైభవ్ 16 ఇన్నింగ్స్‌లలో కలిపి మొత్తం 776 పరుగులు చేశాడు. ఫైనల్ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్‌లకు ఈ రికార్డును దాటే అవకాశం ఉన్నప్పటికీ.. ఫైనల్లో వారు ఫ్లాప్ అవ్వడంతో వైభవ్ సూర్యవంశీ రికార్డు సురక్షితంగా నిలిచింది.
క్రిస్ గేల్ 14 ఏళ్ల నాటి రికార్డు బ్రేక్
ఈ సీజన్లో వైభవ్ సూర్యవంశీ తన సిక్సర్లతో వేటతో అభిమానులను ఎంతగానో అలరించాడు. ఈ 15 ఏళ్ల కుర్రాడు స్టేడియంలో ఫోర్లతో కాకుండా సిక్సర్లతోనే ఎక్కువగా డీల్ చేశాడు. ఈ సీజన్ మొత్తం మీద వైభవ్ సూర్యవంశీ ఏకంగా 72 సిక్సర్లు బాదాడు. తద్వారా 'యూనివర్స్ బాస్' క్రిస్ గేల్ పేరిట ఉన్న 14 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టాడు. క్రిస్ గేల్ 2012 ఐపీఎల్ సీజన్‌లో 59 సిక్సర్లు కొట్టగా.. ఇప్పుడు వైభవ్ ఆ రికార్డును క్లీన్‌గా తుడిచిపెట్టేసి పవర్ హిట్టింగ్‌కు కొత్త అర్థం చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications