IND vs ENG: కన్నీళ్లు పెట్టుకున్న బుడ్డోడు! (వీడియో)
IND vs ENG: టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం కోసం ప్రతి క్రికెట్ అభిమాని ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఐపీఎల్ 2026లో తన విధ్వంసంతో ఆశ్చర్యపరిచిన వైభవ్ సూర్యవంశీ.. భారత జెర్సీలో కూడా అదే దూకుడును ప్రదర్శిస్తాడని అనిపించింది. అయితే వైభవ్ సూర్యవంశీ తన 3 అంతర్జాతీయ ఇన్నింగ్స్‌లలో 15 పరుగుల వ్యక్తిగత స్కోరును అధిగమించడంలో విఫలమయ్యాడు. ఈ క్రమంలో జులై 11న జరిగిన చివరి టీ20 నుంచి వైభవ్ సూర్యవంశీని తొలగించారు. తుది జట్టు నుంచి తనను తప్పించడంతో వైభవ్ సూర్యవంశీ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. నిరాశలో ఉన్న వైభవ్ సూర్యవంశీకి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ వీడియోలో వైభవ్ సూర్యవంశీ టీమిండియా డగౌట్లో నిరాశగా కూర్చుని కనిపించాడు. వైభవ్ చుట్టూ ఇతర భారత ఆటగాళ్లు ఎవరూ కనిపించడం లేదు. కన్నీళ్లను ఆపుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా వైభవ్ సూర్యవంశీ తన చేతిని కళ్లుకు అడ్డుపెట్టుకున్నాడు. వైభవ్ సూర్యవంశీ ఆ సమయంలో నిరాశతో తల దించుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో ఈ సిరీస్‌లో అరంగేట్రం చేసిన ఆల్‌రౌండర్ సూర్యాంశ్ షెడ్గే వైభవ్ దగ్గరకు వెళ్లి అతడిని ప్రోత్సహిస్తూ వీపుపై తట్టడం ఆ వీడియోలో కనిపించింది. ఈ వీడియో టాస్ తర్వాత తీసినట్లుగా కనిపించింది.

ఇంగ్లాండ్‌లో ఫ్లాప్ అయిన వైభవ్ సూర్యవంశీ
ఇంగ్లాండ్ పిచ్ లపై బ్యాటింగ్ చేయడానికి వైభవ్ సూర్యవంశీ చాలా ఇబ్బంది పడ్డాడు. వైభవ్ ఆరంభంలో కొన్ని భారీ షాట్లు కొట్టినప్పటికీ.. ఆ తర్వాత పేలవమైన షాట్‌కు ఔటయ్యాడు. వైభవ్ అరంగేట్ర మ్యాచ్ లో 14 పరుగులు చేసి విల్ జాక్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత రెండు ఇన్నింగ్స్‌లలో జోఫ్రా ఆర్చర్ వేసిన షార్ట్ బంతులతో వైభవ్ సూర్యవంశీని పరీక్షించగా.. వైభవ్ విఫలమై వరుసగా 13, 15 పరుగులు మాత్రమే చేశాడు. ఇంగ్లీష్ పిచ్ లపై ఉండే అధిక బౌన్స్ వల్ల వైభవ్ చాలా ఇబ్బంది పడ్డాడు.
జింబాబ్వే సిరీస్ లో మరో ఛాన్స్
వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ పర్యటన చేదు జ్ఞాపకాల నుంచి బయటపడాల్సి ఉంటుంది. ఈ పర్యటనలో వైభవ్ సూర్యవంశీ మాత్రమే విఫలం కాలేదు.. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివమ్ దూబే వంటి సీనియర్ ఆటగాళ్లు కూడా ఇబ్బంది పడ్డారు. జింబాబ్వేతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జులై 23న ప్రారంభమవుతుంది. వైభవ్ సూర్యవంశీ అన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. ఇది వైభవ్ సూర్యవంశీ ప్రతిభను నిరూపించుకోవడానికి మంచి అవకాశం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications