Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బ్యాట్‌లో AI చిప్.. సోషల్ మీడియాలో నయా పంచాయితీ!

ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్, 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన ఫియర్లెస్ బ్యాటింగ్‌తో క్రికెట్ లోకాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాడు. ప్రతి మ్యాచ్‌లో బౌలర్లను నలుమూలలా బాదుతూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. ఈ క్రమంలోనే వైభవ్ బ్యాటింగ్ శైలిపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. అయితే వైభవ్ సూర్యవంశీ ఈజీగా భారీ సిక్సర్లు బాదడం చూసి కొందరు నెటిజన్లు, విశ్లేషకులు సరదాగా వింత సిద్ధాంతాలను తెరపైకి తెస్తున్నారు. వైభవ్ వాడుతున్న బ్యాట్‌లో ఏమైనా 'ఏఐ' చిప్ ఉందా? అందుకే అంత ఈజీగా షాట్లు కొడుతున్నాడా? అని జోకులు వేస్తున్నారు.

ఇటీవల పాకిస్తాన్ క్రికెట్ విశ్లేషకుడు నౌమాన్ నియాజ్ మాట్లాడుతూ.. వైభవ్ అంత భారీ సిక్సర్లు కొట్టడానికి వైభవ్ బ్యాట్‌లో బహుశా ఏదైనా ఏఐ చిప్ ఉండి ఉండవచ్చని సరదాగా వ్యాఖ్యానించాడు. తాజాగా స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లోని 'అవుట్ ఆర్ నాట్ అవుట్' షోలో ప్రముఖ ప్రెజెంటర్ జతిన్ సప్రూ ఇదే విషయాన్ని మాజీ భారత క్రికెటర్లు ఆకాష్ చోప్రా, మహమ్మద్ కైఫ్ వద్ద ప్రస్తావించాడు. కాగా ఈ సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ ఇప్పటివరకు 13 ఇన్నింగ్స్‌లలో 236.32 స్ట్రైక్ రేట్‌తో 579 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో దూసుకుపోతున్నాడు. ఇందులో ఓ సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

Vaibhav Sooryavanshi Bat AI Chip Rumour Sparks Huge Fight Between Aakash Chopra and Mohammad Kaif

ఈ చర్చలో ఆకాష్ చోప్రా స్పందిస్తూ వైభవ్ సూర్యవంశీ ఎదుగుదలను ఏఐ (కృత్రిమ మేధస్సు) మోడల్‌తో పోల్చాడు. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత దూరం వెళ్తుందో ఎవరూ ఊహించలేరని.. అలాగే క్రికెట్‌లో వైభవ్ సూర్యవంశీ ఎంత ఎత్తుకు ఎదుగుతాడో కూడా ఎవరూ అంచనా వేయలేరని అన్నాడు. ఈ సందర్భంగా వైభవ్ సూర్యవంశీ గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్‌ను గుర్తు చేసుకున్నాడు. "బ్యాట్‌లో ఏఐ చిప్ ఉందా అన్న ప్రశ్నకు నా సమాధానం అవుననే! ఎందుకంటే ఏఐ టెక్నాలజీకి హద్దులు లేవు. మనకు ఓ లిమిట్ ఉంది అనుకుంటాం కానీ, ఐదేళ్ల తర్వాత అది అంతకంటే చాలా ముందుకు వెళ్తుంది. వైభవ్ సూర్యవంశీ కూడా అలాంటి ఒక ఏఐ మోడల్. సచిన్ టెండూల్కర్ 15 ఏళ్ల వయసులో ఆడినప్పుడు అతను ఎంత దూరం వెళ్తాడో చూశాం. కానీ ఈ కుర్రాడు కెరీర్ ప్రారంభించిన విధానం చూస్తే.. అతను భవిష్యత్తులో ఏ స్థాయికి వెళ్తాడో నాకైతే అస్సలు ఐడియా లేదు. అందుకే నేను అతడిని ఏఐ అంటున్నాను" అని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు

అయితే మరో మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ మాత్రం ఈ 'ఏఐ చిప్' సిద్ధాంతాన్ని పూర్తిగా తోసిపుచ్చాడు. వైభవ్ ప్రతిభకు, కష్టానికి పూర్తి క్రెడిట్ ఇవ్వాలని కైఫ్ స్పష్టం చేశాడు. బ్యాట్‌లో ఎలాంటి సాంకేతికత ఉన్నా.. ఆటగాడికి అసలైన నైపుణ్యం లేకపోతే పరుగులు రావు అని తేల్చి చెప్పాడు. "బ్యాట్‌లో చిప్ ఉంటే ఎవరైనా సెంచరీ కొడతారనే గ్యారెంటీ ఉందా? ఒకవేళ అలా గ్యారెంటీ ఇస్తే నేను ఇప్పుడే కామెంట్రీ చెప్పడం మానేస్తా. మీరు బ్యాట్‌ను ఎంత వెడల్పుగా అయినా చేయండి, ఎంత పొడవుగా అయినా చేయండి.. కానీ ఒక ఆటగాడు ఇంత అద్భుతంగా ఆడుతున్నప్పుడు అతని నైపుణ్యాన్ని గౌరవించాలి. ఇక్కడ బ్యాట్‌ది ఏమీ లేదు, అంతా అతని టాలెంట్. అతను ఏడేళ్ల వయసు నుంచే బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ తన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నాడు. నేను చేతులు జోడించి వేడుకుంటున్నాను.. దయచేసి ఆ కుర్రాడి కష్టానికి గుర్తింపు ఇవ్వండి. అతను అద్భుతంగా ఆడుతూ ప్రత్యర్థి బౌలింగ్ అటాక్‌ను ముక్కలు చేస్తున్నాడు" అంటూ మహమ్మద్ కైఫ్ వైభవ్‌ సూర్యవంశీకి మద్దతుగా నిలిచాడు

Story first published: Wednesday, May 20, 2026, 19:50 [IST]
Other articles published on May 20, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+