Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsAUS : ఖవాజా వల్లనే.. ఆసీస్ బ్యాటింగ్ కుప్పకూలింది: మాజీ దిగ్గజం

Usman Khawaza is the cause for Aussie collapse says manjrekar

భారత్‌తో జరిగిన రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియా వరుసగా ఓటములు మూటకట్టుకుంది. ముఖ్యంగా ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ బ్యాటింగ్ చూసిన వాళ్లంతా షాకైపోయారు. ఇంత దారుణంగా ఆ జట్టు ఆడటం ఎప్పుడూ చూడలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆసీస్ మాజీ దిగ్గజాలు కూడా ఆ జట్టు ఆటతీరుపై మండిపడ్డారు. అయితే దీనంతటికీ కారణం ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజానే అని టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు.

ఢిల్లీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఖవాజా అద్భుతంగా ఆడాడు. నాగ్‌పూర్ టెస్టులో 1, 5 స్కోర్లు నమోదు చేసిన అతను.. రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 81 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని మంజ్రేకర్ కూడా గుర్తుచేశాడు. 'మోడ్రన్ క్రికెట్‌లో ఉన్న స్వీప్ షాట్లు అన్నింటినీ తన ఇన్నింగ్స్‌లో ఖవాజా ఆడాడు. నాగ్ పూర్ టెస్టులో ఘోరంగా ఫెయిలైనా.. ఢిల్లీలో అదరగొట్టాడు. దీని వల్లనే ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్ దెబ్బతిన్నది. ఖవాజా బ్యాటింగ్ చూసిన మిగతా వాళ్లు తాము కూడా రాణించాలంటే స్వీప్ షాట్ ఆడాలని డిసైడ్ అయిపోయినట్లు కనిపించింది' అని మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు.

ఎగ్రెసివ్‌గా ఆడాలని, దీని కోసం స్వీప్ షాట్‌ను ఆయుధంగా మార్చుకోవాలని ఆసీస్ ఆటగాళ్లు నిర్ణయించుకున్నట్లు కనిపించిందన్నాడు. అదే సమయంలో ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ అవుటైన విధానం చూస్తే చాలా బాధేసిందన్నాడు. 'అశ్విన్ బౌలింగ్‌లో తను సామాన్యంగా ఆడని స్వీప్ ఆడబోయి స్మిత్ ఎల్బీడబ్ల్యూగా వెనుతిరిగాడు. ఇది చూస్తే చాలా బాధగా అనిపించింది. 2017లో పూణేలో జరిగిన టెస్టులో అతను బాదిన సెంచరీ భారత గడ్డపై విదేశీ ప్లేయర్లు చేసిన అద్భుతమైన సెంచరీల్లో ఒకటి. అలాంటి ఆటగాడేనా ఇలా ఆడింది? అనిపించింది' అని సంజయ్ అన్నాడు.

Story first published: Tuesday, February 21, 2023, 20:17 [IST]
Other articles published on Feb 21, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+