Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Usman Khawaja : వన్డే క్రికెట్ చావు అంచుల్లో ఉంది.. ఇక మిగిలేవి టెస్ట్‌లు, టీ20లే..!

Usman Khawaja Shocking comments On ODI Format, He says That Format is Dying

ఆస్ట్రేలియన్ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా వన్డే క్రికెట్ చావు అంచుల్లో ఉందని భావిస్తున్నట్లు చెప్పాడు. ఇక టెస్ట్ క్రికెట్ ఇప్పటికీ ఎప్పటికీ బలమైన ఉనికిని కలిగి ఉందని.. అందువల్ల టెస్ట్‌లకు ఢోకా లేదని పేర్కొన్నాడు. వన్డే ఫార్మాట్.. అన్ని ఫార్మాట్లలో మూడో ర్యాంకు ఫార్మాట్ అని, ఇది మెల్లిమెల్లిగా చావు దిశగా సాగుతుందని చెప్పాడు. ఇకపోతే ఆల్-ఫార్మాట్ ప్లేయర్‌గా ఉండటం చాలా కష్టమని, కానీ అసాధ్యమేమీ కాదని అతను ఒప్పుకున్నాడు. వన్డే ప్రపంచ కప్ తప్పా.. మిగతా వన్డే క్రికెట్లో పెద్దగా ఫన్ ఏముండదని చెప్పాడు.

వన్డే ప్రపంచకప్ తప్పా..?

వన్డే ప్రపంచకప్ తప్పా..?

ఈఎస్పీఎన్ క్రిక్‌ఇన్‌ఫోలో ఉస్మాన్ ఖవాజా మాట్లాడుతూ.. 'వ్యక్తిగతంగా వన్డే క్రికెట్ నెమ్మదిగా మరణిస్తోందని నేను భావిస్తున్నా. అయితే వన్డేల్లో ఇప్పటికీ ప్రపంచ‌కప్ నిర్వహిస్తున్నారు. ఆ టోర్నీ ఒక్కటి మాత్రం చాలా సరదాగా ఉంటుంది. చూడటానికి ఎక్సైటింగ్‌గా ఉంటుంది. ఇక వన్డే క్రికెట్ గురించి పెద్దగా చెప్పేదేముంది.

వ్యక్తిగతంగా నేను వన్డే జట్టులో లేను. అందువల్ల్ వన్డే క్రికెట్ విషయంలో ఇలాంటి కామెంట్లు చేయొచ్చో లేదో గానీ.. వన్డే క్రికెట్ మాత్రం చేవ చచ్చిన ఆటగా మారుతుంది' అని ఖవాజా తెలిపాడు.

 అన్ని ఫార్మాట్లలో ఆడితే ఇల్లు మర్చిపోవాల్సిందే

అన్ని ఫార్మాట్లలో ఆడితే ఇల్లు మర్చిపోవాల్సిందే

అన్ని ఫార్మాట్లలో ఆడే ప్లేయర్ల గురించి ఖవాజా స్పందించాడు. అన్ని ఫార్మాట్లలో ఆడడం అసాధ్యం కాదు.. కానీ చాలా కఠినమైనది. మూడు ఫార్మాట్ల గేమ్‌లు ఆడుతున్నట్లయితే.. మీకింకా ఇంట్లో గడిపేందుకు టైం ఉండదు. మీరు శారీరకంగా, మానసికంగా చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇకపోతే చాలా మంది ప్లేయర్లు ఐపీఎల్ కూడా ఆడుతుంటారు.

అందువల్ల వాళ్ల టైం అంతా ఇటా మ్యాచ్‌లు ఆడడానికే సరిపోతుంది.' అని ఖవాజా తెలిపాడు. గత దశాబ్ద కాలంగా ఆస్ట్రేలియా టెస్టు జట్టులో ఖవాజా ఓ సభ్యుడిగా ఉన్నాడు. అతను జనవరి 2011లో ఇంగ్లాండ్‌తో సిడ్నీలో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తరఫున అరంగేట్రం చేశాడు. ఇక తన కెరీర్లో ఖవాజా 51 టెస్ట్ మ్యాచ్‌లు, 40 వన్డేలు, 9 టీ20లు ఆడాడు.

వన్డే క్రికెట్ వల్ల ఏం లాభం?

వన్డే క్రికెట్ వల్ల ఏం లాభం?

అతను ఇంగ్లాండ్‌లో జరిగిన 2019 ప్రపంచకప్ ఆస్ట్రేలియా జట్టులో సభ్యుడు కూడా. ఖవాజా అన్ని ఫార్మాట్లలో కలిపి 14సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలతో 44.20 సగటుతో 5,570 పరుగులు చేశాడు. 'ప్రజలు ఇప్పటికీ టెస్ట్ క్రికెట్‌ను ఇష్టపడతారు. అది నాకు ఇష్టమైన ఫార్మాట్. టెస్ట్ క్రికెట్ ఇప్పటికీ చాలా బలమైన ఉనికిని కలిగి ఉంది కాబట్టి దానికి పెద్ద ఇబ్బందేం ఉండదు. నా ప్రకారం.. టెస్టులు, టీ20లు రెండూ సమతూకం కాగలవు. కానీ వన్డే క్రికెట్ వల్ల ఏం లభిస్తుందో మీరే ప్రశ్నించుకోండి.' అంటూ ఖవాజా స్పష్టం చేశాడు.

Story first published: Friday, July 22, 2022, 17:33 [IST]
Other articles published on Jul 22, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+