రొటీన్‌గా కాకుండా కాస్త భిన్నంగా: క్రికెట్ ఆస్ట్రేలియా జట్టు వీడియో వైరల్

హైదరాబాద్: మూడు టీ20ల సిరిస్ ముగిసిన తర్వాత ఇరు జట్ల మధ్య అడిలైడ్ వేదికగా డిసెంబర్ 6 నుంచి నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టెస్టు సిరీస్‌కు సంబంధించి తొలి రెండు టెస్టులకు గానూ క్రికెట్ ఆస్ట్రేలియా జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే జట్టు ప్రకటనను రొటీన్‌గా కాకుండా కాస్త భిన్నంగా ప్రకటించింది క్రికెట్ ఆస్ట్రేలియా. జట్టు ప్రకటన విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా ఓ ప్రత్యేకమైన వీడియోని రూపొందించింది. ఈ వీడియోని క్రికెట్ ఆస్ట్రేలియా తన అధికారిక ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మ్యాచ్ కోసం పిచ్ తయారు చేస్తున్నప్పటి నుంచి
ఓ వ్యక్తి పిల్లలు ఆడుకునే మ్యాచ్ కోసం పిచ్ తయారు చేస్తున్నప్పటి నుంచి ఈ వీడియో మొదలవుతుంది. ఒక్కో సందర్భంలో ఒక్కో ప్లేయర్ పేరును వెల్లడిస్తూ ఈ వీడియో సాగుతుంది. ఇలా మొదటి రెండు టెస్టులకు ఎంపిక చేసిన మొత్తం 14 మంది ప్లేయర్స్ పేర్లను క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. మొత్తం 14 మందితో కూడిన జట్టులో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా తిరిగి చోటు దక్కించుకున్నాడు.

దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేస్తోన్న
ఆస్ట్రేలియా తరుపున ఇద్దరు కొత్త కుర్రాళ్లు ఈ టెస్టు సిరిస్‌లో చోటు దక్కించుకున్నారు. దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేస్తోన్న యువ ఆటగాడు మార్కస్ హారిస్ తొలిసారిగా ఆస్ట్రేలియా టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు. అతడితో పాటు బౌలర్ క్రిస్ ట్రెమెయిన్‌కు కూడా టెస్టు అరంగేట్రానికి అవకాశమిచ్చారు. భారత్‌తో జరిగే నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో టిమ్ ఫైన్ ఆసీస్ కెప్టెన్‌గా వ్వహారిస్తోండగా... హజిల్‌వుడ్, మిచెల్ మార్ష్ వైస్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు.

అడిలైడ్ వేదికగా తొలి టెస్టు
డిసెంబర్ 6 నుంచి ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. బుధవారం బ్రిస్బేన్ వేదికగా జరిగిన తొలి టీ20తో టీమిండియా ఆసీస్ పర్యటన ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఆస్ట్రేలియా జట్టు:
టిమ్ ఫైన్(కెప్టెన్, వికెట్‌కీపర్), అరోన్ ఫించ్, పాట్ కమిన్స్, పీటర్ హ్యాండ్స్‌కంబ్, మార్కస్ హారిస్, హజిల్‌వుడ్(వైస్ కెప్టెన్), ట్రావిస్ హేడ్, ఉస్మాన్ ఖవాజా, నాథన్ లియాన్, మిచెల్ మార్ష్(వైస్ కెప్టెన్), షాన్ మార్ష్, మిచెల్ స్టార్క్, క్రిస్ ట్రెమెయిన్, పీటర్ సిడిల్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications