For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఉసేన్ బోల్ట్‌కు షాక్: సాకర్‌ ప్రొఫెషనల్‌గా మారకముందే నోటీసులు

Usain Bolt questions why he is being drug tested as he is not yet a professional footballer

హైదరాబాద్: గ్రేటెస్ట్ స్ప్రింటర్‌గా పేరుతెచ్చుకున్న ఉసేన్ బోల్ట్ గతేడాది అథ్లెటిక్స్‌కు వీడ్కోలు పలికి ప్రొఫెషనల్‌ ఫుట్‌బాలర్‌గా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాలో సెంట్రల్‌ కోస్ట్‌ మెరైనర్స్‌ ఫుట్‌బాల్‌ జట్టుకు బోల్ట్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ జట్టు తరుపున ఉసేన్‌ బోల్ట్ ప్రసుత్తం ట్రయల్స్‌లో ఉన్నాడు.

డోపింగ్‌ టెస్టు నోటీసులు అందడంపై మండిపడ్డ బోల్ట్

డోపింగ్‌ టెస్టు నోటీసులు అందడంపై మండిపడ్డ బోల్ట్

ఇంకా సాకర్‌ ప్రొఫెషనల్‌గా మారకముందే డోపింగ్‌ టెస్టు నోటీసులు అందడంపై బోల్ట్ మండిపడ్డాడు. ఇప్పటికే ట్రాక్‌కు వీడ్కోలు చెప్పిన తనకు డోప్‌ పరీక్షలేంటని "ఫుట్‌బాలర్‌ అయ్యేందుకు ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ నుంచి రిటైరయ్యా. కానీ ఈ నోటీసేంటో అర్థం కావట్లేదు. కానీ ఇది చూడండి" అని తనకు వచ్చిన నోటీసును చూపిస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు.

నోటీసులు ఇచ్చిన ఆస్ట్రేలియా ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌

నోటీసులు ఇచ్చిన ఆస్ట్రేలియా ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌

పోటీలు లేని సమయంలో జరిపే పరీక్షల కోసం మూత్ర, రక్త నమూనాలు సేకరించేందుకు అతడికి నోటీసు అందింది. ఈ నోటీసులను ఆస్ట్రేలియా ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. "ఈ రోజు డ్రగ్‌ టెస్టుకు ఎలా వెళ్లగలను? నేను ఇంకా ప్రొఫెషనల్‌ ఫుట్‌బాలర్‌ కాదుగా" అని నాకు నోటీసు ఇచ్చిన ఆమెను ఉసేన్‌ ప్రశ్నించాడు.

శాంపిల్‌ సేకరణకు వచ్చిన అధికారిణిని ప్రశ్నించా

"ఎటువంటి కాంట్రాక్ట్‌ కుదుర్చుకోకుండానే ఎందుకు డోపింగ్‌ పరీక్ష చేయించుకోవాలని శాంపిల్‌ సేకరణకు వచ్చిన అధికారిణిని ప్రశ్నించా. 'నువ్వు అగ్రశ్రేణి అథ్లెట్‌వి. అందుకే పరీక్ష చేయించుకోవాలి' అని ఆమె చెప్పింది" అని బోల్ట్‌ అన్నాడు. బోల్ట్‌ అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ ఆస్ట్రేలియా క్రీడల డోపింగ్‌ నిరోధ సంస్థ నిబంధనల ప్రకారం పరీక్షలకు బోల్ట్‌ అర్హుడే.

తొలి మ్యాచ్‌లో రెండు గోల్స్‌తో మెరిసిన బోల్ట్

ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియాలోని సెంట్రల్‌ కోస్ట్‌ మరైనర్స్‌కు ప్రాతినిధ్యం వహించిన బోల్ట్‌ ఈ మ్యాచ్‌లో రెండు గోల్స్‌తో మెరిశాడు. ఈ సీజన్‌ ఆరంభానికి ముందు మకార్థర్‌ సౌత్‌ వెస్ట్‌ యునైటెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో 55వ, 69వ నిమిషంలో రెండు గోల్స్ కొట్టాడు. గోల్స్ చేసిన అనంతరం 'లైటినింగ్‌ బోల్ట్‌' భంగిమతో సంబరాలు చేసుకుని అభిమానులను అలరించాడు. ఈ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో మకార్థర్‌ సౌత్‌ వెస్ట్‌ యునైటెడ్‌ జట్టుపై బోల్ట్‌ జట్టు 4-0తో ఘనవిజయం సాధించింది.

Story first published: Tuesday, October 16, 2018, 9:55 [IST]
Other articles published on Oct 16, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+