బెంగళూర్లో పోరు: యువీకి ఉసెన్ బోల్ట్ చాలెంజ్, ట్వీట్
బెంగళూరు: పరుగుల వీరుడు జమైకా చిరుత ఉసెన్ బోల్డ్ బెంగళూరుకు చేరుకున్నాడు. మంగళవారం సాయంత్రం చిన్నస్వామి స్టేడియంలో ఎగ్జిబిషన్ క్రికెట్ మ్యాచ్ ఆడుతారు.
భారత్ లెఫ్ట్ హ్యాండర్ యువరాజ్ సింగ్‌తో ఉసెన్ బోల్ట్ తలపడనున్నారు. హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్‌లు కూడా ఈ మ్యాచ్‌లో ఆడనున్నారు.
బెంగళూరులో సాయంత్రం ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇది స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్. ప్రముఖ క్రీడా పరికరాల సంస్థ ప్యూమా ఈ మ్యాచ్‌ను నిర్వహిస్తోంది.

ఉసెన్ బోల్ట్, యువరాజ్ సింగ్
ఇన్నింగ్స్‌కు నాలుగు ఓవర్ల చొప్పున ఏడేసి మంది ఆటగాళ్లు బరిలోకి దిగే ఈ మ్యాచ్‌లో బోల్ట్ - యువరాజ్ ప్రత్యర్థులుగా మారబోతున్నారు.

ఉసెన్ బోల్ట్, యువరాజ్ సింగ్
బోల్ట్ జట్టులో అతని చిన్ననాటి మిత్రుడు వాకర్‌తో పాటు భారత సీనియర్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా ఉన్నాడు. యువరాజ్ సింగ్ జట్టుకు జహీర్ ఖాన్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

ఉసెన్ బోల్ట్, యువరాజ్ సింగ్
మిగతా సభ్యులు ఆన్ లైన్ ద్వారా ఎంపికైన క్రికెట్ అభిమానులే. ఈ మ్యాచ్‌లో బోల్ట్, యువరాజ్‌లు నాలుగు ఓవర్లు పూర్తిగా బ్యాటింగ్ చేస్తారు. వాళ్లు ఔటైనా ఔటివ్వరు. ఓ బ్యాట్స్‌మెన్ ఔటైతే నాలుగు పరుగులు కోతేస్తారు.

ఉసెన్ బోల్ట్, యువరాజ్ సింగ్
కాగా, తాను బెంగళూరులో ఉన్నట్లు బోల్ట్ ఉదయం ట్వీట్ చేశాడు. యువరాజ్ సింగ్‌ను ఉద్దేశించి కూడా ఓ ట్వీట్ చేశాడు. యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్‌లకు ఉసెన్ బోల్ట్ వంద మీటర్ల పరుగు సవాల్ విసిరారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications