ఐసీసీ ఒప్పుకుంటే ద్వైపాక్షిక సిరీస్‌కు ఆతిథ్యమిస్తానంటోన్న అమెరికా

Posted By:
 USACA events are unsanctioned, asserts ICC

హైదరాబాద్: యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా క్రికెట్ అసోసియేషన్ (యూఎస్ఏసీఏ)కు సంబంధించిన ఐసీసీ మాజీ సభ్యుడు చేసిన ప్రతిపాదన ప్రకారం.. ద్వైపాక్షిక సిరీస్ గురించి ఐసీసీ ఓ ప్రకటన జారీ చేసింది.

ఐసీసీ, బీసీసీఐ రెండింటిలో ఏదో ఒక్క బోర్డు నుంచి ఆమోదం వచ్చినా అమెరికాలో ఆతిథ్యమిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. ఐసీసీ నియమావళి నుంచి జూన్ 2017న సదరు బోర్డు తప్పుకుంది.

కాగా, వచ్చే నెలలో జరగనున్న భారత మహిళా క్రికెట్ జట్టుకు సైతం తాము ఆతిథ్యమిచ్చేందుకు సిద్ధమని పేర్కొంది. ఇదే నెలలో భారతదేశానికి చెందిన పురుషుల విభాగంలోని ఇండియన్ టీ20 క్రికెట్ ఫెడరేషన్‌ నిర్వహించే లీగ్‌కు సైతం తాము ఆతిథ్యమిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది.

జాతీయ క్రికెట్ ఫెడరేషన్ నిషేదించిన క్రికెటర్లు, కెప్టెన్లు, కోచ్‌లు, మేనేజ్‌మెంట్ సిబ్బంది సైతం పాల్గొనేందుకు అనర్హులని ప్రకటించింది. ఐసీసీ నియమానుసారమే ఈ మ్యాచ్ లను నిర్దేశించనున్నట్లు పేర్కొంది.

Story first published: Monday, March 12, 2018, 15:40 [IST]
Other articles published on Mar 12, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి