For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వన్డేలో చరిత్ర సృష్టించిన యూఎస్‌ఏ - 40ఏళ్ల టీమిండియా రికార్డ్ బద్దలు!

వన్డే క్రికెట్‌లో సరికొత్త రికార్డు నమోదైంది. 40 ఏళ్ల క్రితం టీమిండియా నమోదు చేసిన ఓ రికార్డును తాజాగా యూఎస్‌ఏ అధిగమించింది. తాజాగా యూఎస్‌ఏ, ఒమన్‌ మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ అద్భుతం చోటు చేసుకుంది. ఇంతకీ ఆ రికార్డు ఏంటి?, ఈ మ్యాచ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం..

తాజాగా జరిగిన మ్యాచ్‌లో ఒమన్‌పై యూఎస్‌ఏ 57 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ కు దిగిన యూఎస్‌ఏ 35.3 ఓవర్లలో 122 పరుగుల చేసి ఆలౌట్ అయింది. మిలింద్‌ కుమార్‌ (47 నాటౌట్‌) హాఫ్ సెంచరీకి చేరువగా వచ్చి ఔటయ్యాడు. మిగతా వారు నామమాత్రపు పరుగులు చేశారు. ఒమన్‌ బౌలర్లలో షకీల్‌ అహ్మద్‌ 3 వికెట్లు పడగొట్టగా.. ఆమిర్‌ కలీమ్‌, సమయ్‌ శ్రీవత్సవ్‌ చెరో 2 వికెట్లు తీశారు. సిద్దార్థ్‌ బుక్కపట్నం, జే ఒడెడ్రా చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

USA Defends Lowest Ever Total in ODI History Breaking TeamIndia s 40-Year-Old Record
Photo Credit: twitter

అనంతరం 123 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఒమన్‌.. యూఎస్‌ఏ స్పిన్నర్ల ధాటికి 25.3 ఓవర్లలో 65 పరుగులకే కుప్పకూలింది. Nosthush Kenjige ఐదు వికెట్లు తీసి చెలరేగాడు. మిలింద్‌ కుమార్‌, యాసిర్‌ మొహ్మద్ తలో రెండు వికెట్లు తీయగా.. హర్మీత్‌ సింగ్‌ ఓ వికెట్‌ పడగొట్టాడు. ఒమన్‌ బ్యాటర్లలో హమ్మద్‌ మీర్జా (29)తో మిగతా వారు కూడా విఫలమయ్యారు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే రెండు ఇన్నింగ్స్ (ఒమన్, యూఎస్ఏ) లోనూ వికెట్లు తీసిన బౌలర్లందరూ స్పిన్నర్లే కావడం విశేషం. వన్డే క్రికెట్‌ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి.

40 ఏళ్ల రికార్డ్ బద్దలు..
ఈ మ్యాచ్‌లో ఓ అరుదైన రికార్డు నమోదైంది. వన్డేల్లో అత్యంత తక్కువ స్కోర్‌ను (122) డిఫెండ్‌ చేసుకున్న జట్టుగా యూఎస్‌ఏ నిలిచింది. గతంలో 1985లో పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 125 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుంది. అలా 40 ఏళ్ల తర్వాత యూఎస్‌ఏ.. టీమిండియా రికార్డును అధిగమించింది.

Story first published: Wednesday, February 19, 2025, 11:30 [IST]
Other articles published on Feb 19, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+