ఐపీఎల్‌లో సక్సెస్‌ఫుల్ టీమ్స్‌లో ఒకటైన రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలో భారీగా పెట్టుబడి పెట్టేందుకు అమెరికాకు చెందిన ఒక ప్రముఖ సంస్థ రెడీ అయింది. రాజస్థాన్ ఫ్రాంచైజీకి ఏకంగా 650 మిలియన్ డాలర్ల విలువ కట్టిన ఈ కంపెనీ.. దీనిలో వెంటనే 40 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలని అనుకుంటోందని సమచారం.
ఈ డీల్ మరికొన్ని రోజుల్లోనే పూర్తి అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలో మేజర్ షేర్ హోల్డర్‌గా యూకేకు చెందిన మనోజ్ బదాలే ఉన్నారు. ఆయన వద్ద ఈ ఫ్రాంచైజీలో ఏకంగా 60 శాతం షేర్లు ఉన్నాయి. ఈ మనోజ్ బదాలేలో డైరెక్ట్‌గా లేదా ఇండైరెక్ట్‌గా 40 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలని న్యూయార్క్‌కు చెందిన టైగర్ గ్లోబల్ నిర్ణయించుకుంది.

టైగర్ గ్లోబల్ ఇటీవలి కాలంలో భారత దేశంలోని వివిధ కంపెనీలపై ఫోకస్ పెట్టింది. ఫ్లిప్‌కార్ట్, జొమాట్, డెల్హివరీ వంటి పలు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది. అలాగే చాలా కాలంగా ఐపీఎల్‌లో కూడా పెట్టుబడులు పెట్టి, తమ వ్యాపారాన్ని విస్తరించుకోవాలని అనుకుంటోంది. కానీ ఇప్పటి వరకు అలా జరగలేదు. పలు ఫ్రాంచైజీలతో టైగర్ గ్లోబల్ ప్రతినిధులు ఈ విషయమై చర్చలు జరిపినట్లు సమాచారం. చివరకు రాజస్థాన్ రాయల్స్‌తో ఈ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది.
ఈ డీల్ గురించి రాజస్థాన్ ఫ్రాంచైజీ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. అదే సమయంలో టైగర్ గ్లోబల్ కూడా దీనిపై స్పందించడానికి నిరాకరించింది. కాగా, 2021లోనే యూఎస్‌కు చెందిన రెడ్ బర్డ్ క్యాపిటల్ అనే సంస్థ రాజస్థాన్ రాయల్స్‌కు 250 మిలియన్ డాలర్లపైగా విలువ కట్టి కొన్ని షేర్లు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరి తాజా ఒప్పందంతో రాజస్థాన్ విలువ మరింత పెరుగుతుందేమో చూడాలి. ఇదిలా ఉండగా.. రాజస్థాన్ రాయల్స్ గత రెండు సీజన్లుగా ఐపీఎల్‌లో చక్కని ఆటతీరు కనబరుస్తున్న సంగతి తెలిసిందే.