Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సీఎస్కే స్టార్ ఊచకోత.. జైస్వాల్ ఆల్‌టైమ్ రికార్డ్ సమం!

ఐపీఎల్ 2026లో మరో అద్భుత రికార్డు నమోదైంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్కే బ్యాటర్ ఉర్విల్ పటేల్ శివతాండవం చేశాడు. క్రీజులోకి వచ్చిన క్షణం నుంచే లక్నో బౌలర్లపై విరుచుకుపడిన అతను కేవలం 13 బంతుల్లోనే తన అర్ధ సెంచరీని పూర్తి చేసి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్‌తో ఐపీఎల్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు.

జైస్వాల్ సరసన ఉర్విల్ పటేల్
ఈ విధ్వంసకర ఇన్నింగ్స్‌లో ఉర్విల్ పటేల్ కేవలం ఒకే ఒక్క ఫోర్ కొట్టగా.. ఏకంగా 7 భారీ సిక్సర్లతో చెలరేగిపోయాడు. ఈ అసాధారణ ప్రదర్శనతో ఐపీఎల్‌లో అత్యంత వేగంగా అర్ధ సెంచరీ చేసిన ఆటగాడిగా యశస్వి జైస్వాల్ పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును ఉర్విల్ సమం చేశాడు. 2023 సీజన్‌లో జైస్వాల్ కేకేఆర్ మీద 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది చరిత్ర సృష్టించగా.. ఇప్పుడు ఉర్విల్ పటేల్ అదే ఫీట్‌ను పునరావృతం చేసి జైస్వాల్ సరసన నిలిచాడు.

Urvil Patel Smashes Fastest IPL Fifty in 13 Balls Equals Yashasvi Jaiswal All-Time Record

తండ్రికి అంకితం
ఈ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించిన అనంతరం ఉర్విల్ పటేల్ సెలబ్రేషన్ చేసుకున్నాడు. ఈ ఘనతను తన తండ్రికి అంకితమిస్తూ ఎమోషనల్ అయ్యాడు. ఓ చీటీలో రాసుకొచ్చిన కొన్ని పదాలను అభిమానులకు చూపించాడు.తన జేబులో నుంచి తీసిన చీటీలో "దిస్ ఈజ్ ఫర్ యూ పాపా.. లవ్ యూ" అని రాసి ఉంది. ఈ సెలబ్రేషన్ చూసిన సీఎస్కే ఫ్యాన్స్ ఉర్విల్ పటేల్ ను ఎంతగానో మెచ్చుకుంటున్నారు. తన తల్లిదండ్రుల మీద ఈ యువ క్రికెటర్ కు ఉన్న ప్రేమకు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

వెనక్కి తగ్గిన హేమాహేమీలు
ఉర్విల్ పటేల్ సృష్టించిన ఈ సునామీతో ఐపీఎల్‌లో దిగ్గజ ఆటగాళ్ల రికార్డులు కనుమరుగయ్యాయి. ఇప్పటివరకు కేఎల్ రాహుల్, పాట్ కమిన్స్, రోమారియో షెపర్డ్ తలా 14 బంతుల్లో అర్ధ శతకాలు సాధించి రెండో స్థానంలో ఉండగా.. ఇప్పుడు ఉర్విల్ వారిని అధిగమించి అగ్రస్థానానికి చేరుకున్నాడు. చెపాక్ లాంటి స్పిన్ అనుకూల పిచ్‌పై కూడా ఉర్విల్ సిక్సర్ల వర్షం కురిపించడం విశేషం.

రికార్డుల వేటలో ఉర్విల్
సాధారణంగా ఐపీఎల్‌లో ఓపెనర్లు పవర్‌ప్లేను వాడుకుని ఇలాంటి రికార్డులు సృష్టిస్తుంటారు. కానీ ఉర్విల్ పటేల్ బ్యాటింగ్ చేసిన తీరు, ముఖ్యంగా అతని స్ట్రైక్ రేట్ చూస్తుంటే బౌలర్లు ఎక్కడ వేసినా బంతి గాల్లోకి లేవాల్సిందే అన్నట్లుగా సాగింది. ఈ సీజన్‌లో ఉర్విల్ ఫామ్ సీఎస్కే జట్టుకు కొండంత బలాన్ని ఇస్తుండగా.. అతని విధ్వంసం చూసి సోషల్ మీడియాలో నెటిజన్లు "కొత్త సిక్సర్ల కింగ్ వచ్చాడు" అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Story first published: Sunday, May 10, 2026, 18:49 [IST]
Other articles published on May 10, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+