ఆయనకు నా ఫాస్టెస్ట్ 50 అంకితం- ఉర్విల్ పటేల్
ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ ఉర్విల్ పటేల్ చరిత్ర సృష్టించాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 13 బంతుల్లోనే మెరుపు వేగంతో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. ఇది.. ఐపీఎల్ చరిత్రలోనే జాయింట్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ. ఉర్విల్ ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, ఎనిమిది భారీ సిక్సర్లు నమోదయ్యాయి. ఇదివరకు ఈ రికార్డు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ పేరు మీద ఉండేది. 2023 ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 13 బంతుల్లోనే రికార్డు సృష్టించగా, ఉర్విల్ ఇప్పుడు దాన్ని సమం చేశాడు.
ఫాస్టెస్ట్ 50లు ఇతర బ్యాటర్ల పేర్ల మీదా ఉన్నాయి. కేఎల్ రాహుల్, పాట్ కమిన్స్, రొమారియో షెపర్డ్ 14 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నారు. వైభవ్ సూర్యవంశీ రెండుసార్లు 15 బంతుల్లో అర్ధశతకాలు సాధించాడు. ఇప్పుడు ఆయా బ్యాటర్ల సరసన చేరాడు ఉర్విల్ పటేల్. లక్నో సూపర్ జెయింట్స్ పై జరిగిన మ్యాచ్ లో నంబర్ 3లో బ్యాటింగ్‌కు దిగిన ఉర్విల్.. ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో మూడు వరుస సిక్సర్లతో దూకుడుగా ఆరంభించాడు.

దిగ్వేష్ రాథీ వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌లో మూడు సిక్సర్లు, ఒక ఫోర్‌తో సహా 25 పరుగులు రాబట్టాడు. మహ్మద్ షమీ బౌలింగ్‌లో లాంగ్ ఆన్ దిశగా భారీ సిక్స్ కొట్టి, 13వ బంతికి సింగిల్‌తో తన అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. 27 ఏళ్ల ఉర్విల్ పటేల్ దేశవాళీ క్రికెట్‌లో గుజరాత్‌కు, అలాగే ఇండియా-ఏ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అతని సిక్సర్లన్నీ ఎక్కువగా లాంగ్ ఆన్, మిడ్ వికెట్ దిశగా దూసుకెళ్లాయి.
ఈ అద్భుత మైలురాయిని చేరుకున్న తర్వాత, ఉర్విల్ పటేల్ ఎమోషన్ అయ్యాడు. ఈ ఇన్నింగ్ ను తన తండ్రికి అంకితం చేసినట్లు చెప్పాడు. జేబులోంచి "This is for you Papa" అని రాసి ఉన్న కాగితాన్ని తీసి చూపించడం ఆకట్టుకుంది. తొలి అర్ధశతకం చాలా భావోద్వేగమైనదని, దీన్ని నాన్నకు అంకితం చేయాలనుకుంటున్నానని అన్నాడు. 'నువ్వు ఆడుతున్న తీరు నాకు నచ్చింది, పరుగులు వచ్చినా రాకపోయినా నాకు పర్వాలేదు, ఇలాగే ఆడు'.. అని నాన్న తనతో ఎప్పుడూ చెప్పేవాడని, ఆయన కోసమే ఆడతానని ఉర్విల్ తెలిపారు.
దిగ్గజ క్రికెటర్ ఎంఎస్ ధోనితో జరిగిన సంభాషణను ఉర్విల్ పటేల్ గుర్తు చేసుకున్నాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఆయనతో పంచుకున్ను అనుభవాలు కేరర్ లో ఎంతగానో ఉపయోపడుతున్నాయని చెప్పాడు. త్వరగా అవుట్ అవుతున్నానని, దీన్ని ఎలా సరిదిద్దుకోవాలని అడిగినప్పుడు ధోనీ విలువైన సలహాలు ఇచ్చాడని అన్నాడు. 'నీ నైపుణ్యంపై నాకు ఎటువంటి సందేహం లేదు, సందేహం ఏదైనా ఉంటే, అది నీ మనసులోనే ఉంది. స్పష్టంగా ఉండి, సరైన బంతిని సరైన చోట కొట్టడానికి ప్రయత్నించు' అని సలహా ఇచ్చారు" అని ఉర్విల్ పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications