
సోషల్ మీడియాలో ఊర్వశిని బ్లాక్ చేసిన పంత్..
ఊర్వశి రౌటెలాతో రిషభ్ పంత్ రిలేషన్‌లో ఉన్నాడని గతంలో వార్తలు పోటెత్తాయి. అయితే పంత్ ఈ పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టాడు. సోషల్ మీడియాలో ఊర్వశి రౌటెలాను బ్లాక్ చేసి తమ మధ్య ఏం లేదని క్లారిటీ ఇచ్చేశాడు. అప్పట్లో ఇది మీడియాలో పెద్ద సెన్సేషనల్ వార్తగా మారింది. ఆ కొద్ది రోజులకే రిషభ్ పంత్, ఇషా నేగి అనే మోడల్‌తో ప్రేమలో ఉన్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఊర్వశి రౌటెలాకు పంత్ మధ్య ఏం లేదనే క్లారిటీ వచ్చింది. అయితే ఊర్వశి మాత్రం అవకాశం వచ్చినప్పుడల్లా పంత్ గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూనే ఉంది.

ఎక్కడ విభేదాలు వచ్చాయో చెప్పిన ఊర్వశి
నెల రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో రిషభ్ పంత్‌తో తనకు ఎక్కడ విభేదాలు వచ్చాయో ఊర్వశి సంచలన విషయాలు బయటపెట్టింది. వారణాసిలో ఓ షూటింగ్‌లో పాల్గొన్న తనను కలవడానికి పంత్ రాగా.. తాను అలసిపోయి హోటల్‌లో పడుకోవడంతో అతన్ని కలవలేదని దాదాపు 17సార్లు ఫోన్ చేసి వెళ్లిపోయాడని, వెంటనే ఫోన్ చేసి ముంబైలో కలుస్తానని చెప్పానని పేర్కొంది. చెప్పినట్టే ముంబైకి వెళ్లినప్పుడు కలిసానని, అయితే ఆ తర్వాతే ఏం జరిగిందో తెలీయదు కానీ అతను తనతో మాట్లాడటం మానేసాడని చెప్పింది.

ఫేం కోసం పాకులాడేవారిని చూస్తే జాలేస్తుందంటూ..
అయితే ఇంటర్వ్యూలో ఊర్వశి చేసిన వ్యాఖ్యలు సెన్సేషన్ కావడంతో పంత్ స్పందించాడు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఊర్వశి పేరు ప్రస్తావించకుండానే 'కొందరు ఫేమ్, పాపులారిటీ కోసం ఇంటర్వ్యూల్లో ఎందుకు ఇలా అబద్ధాలు చెబుతారో అర్థం కాదు. ఫన్నీ ఫెల్లోస్. పేరు కోసం, ఫేమ్ కోసం ఇంతగా పాకులాడే వారిని చూస్తుంటే జాలేస్తుంది. వాళ్లకి దేవుడి ఆశీస్సులు ఉండాలి గాక' అంటూ ఇన్‌స్టా స్టోరీలో పంత్ రాసుకొచ్చాడు. తన గురించి ఊర్వశీ చెప్పింది పచ్చి అబద్దమని పంత్ తన స్టోరీ ద్వారా తెలియజేశాడు.
తరచూ కవ్విస్తున్న ఊర్వశి
పంత్ పోస్ట్‌పై స్పందించిన ఊర్వశి 'అరే ఓ చోటు భయ్యా.. బ్యాట్ బాల్ ఆడుకో. నేను చిన్నపిల్లను కాదు. నీలాంటి పిల్ల బచ్చా వల్ల బద్నాం అవ్వడానికి. ఆర్‌పీ చోటు భయ్యా రక్షబంధన్ శుభాకాంక్షలు. సైలెంట్‌గా ఉన్నానని అడ్వాంటేజ్ తీసుకోకు. నువ్వో కౌగర్ హంటర్(తన కంటే ఎక్కువ వయసున్న అమ్మాయితో శారీరక సంబంధం కోరుకునే పురుషుడు). ' అని ఇన్‌స్టాలో ఘాటుగా పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేసింది. ఆ తర్వాత పంత్ సైతం మనకు సంబంధం లేని విషయాలను పట్టించుకోకపోవడమే మంచిదంటూ మరో పోస్ట్ చేశాడు. ఆసియాకప్ వేదికగా పాక్ వర్సెస్ ఇండియా ఆడిన మ్యాచ్‌లకు ఊర్వశి రావడం కూడా బాగా హైలెట్ అయింది. ఆ తర్వాత నసీమ్ షా నవ్వుతో కూడిన వీడియోను పోస్ట్ చేసి ఊర్వశి ఓ వీడియో కూడా పోస్టు చేసింది. ఇక ఈ వీడియో అనంతరం స్వారీ కూడా చెప్పింది. అయితే అది పంత్‌కు కాదని అభిమానులకు అంటూ మరో ట్విస్ట్ ఇచ్చింది. ఏదేమైనా ఊర్వశి తరచూ పంత్‌ను కవ్వించే ప్రయత్నం చేస్తోంది. తాజాగా బర్త్ డే విషెస్ చెప్పడం వెనక ఏం మతలబు ఉందో మాత్రం తెలియట్లేదు.


Click it and Unblock the Notifications












