Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాక్ కుర్రాడు నషీమ్ షా మీద మనసుపడ్డ ఊర్వశి రౌటేలా..? ఇన్‌స్టా స్టోరీలో క్యూట్ వీడియో షేర్, నెటిజన్ల ట్రోల్స్

Urvasi Rautela Shared a Cute Video Of Naseem shah and Her Each othe Blusshing at Stadium

బాలీవుడ్ దివా ఊర్వశి రౌటేలా ఇటీవల భారత క్రికెటర్ రిషబ్ పంత్‌తో కోల్డ్ వార్‌తో వార్తల్లో హాట్ టాపిక్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు పోస్టులతో దుమ్మెత్తిపోసుకున్నారు. అయితే ఎవరూ పేర్లు ప్రస్తావించకుండానే కక్కాల్సిందంతా కక్కేశారు. ఇక వీరి మధ్య రగడా నెటిజన్లకు మంచి టాపిక్‌గా మారింది. పంత్, ఊర్వశి మధ్య ట్రోల్స్ పుంఖానుపుంఖాలుగా వచ్చాయి. ఇటీవల సెప్టెంబర్ 4న జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌లో మళ్లీ ఊర్వశి కనిపించింది.

అయితే ఆ మ్యాచ్‌లో ఇండియా ఓడిపోవడం, పంత్ చెత్త షాట్ ఆడడం తెలిసిందే. ఇక ఆ మ్యాచ్ తర్వాత ఊర్వశి వల్లే పంత్ ఫామ్ కోల్పోయాడంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు. అయితే ఇప్పుడు ఆమె మరోసారి నెటిజన్ల ట్రోల్స్‌కు గురయ్యింది. అందుకు డిఫెరెంట్ కారణముంది. ఈసారి పాకిస్తాన్ యువ క్రికెటర్ 20ఏళ్ల నసీమ్ షా విషయమై ఆమె ట్రోల్స్‌కు గురయింది.

ఒకరినొకరు చూసుకుని ముసిముసి నవ్వులు

ఊర్వశి రౌతేలా - నసీమ్ షా ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకుంటున్నట్లు క్రియేట్ చేసిన ఓ వీడియో రెడ్డిట్ ప్లాట్‌ఫాంలలో వైరల్ అవగా.. ఈ వీడియోను ఊర్వశి తన ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. దీంతో నెటిజన్లు ఆమెపై ట్రోల్స్‌తో పేట్రేగిపోయారు. ఆ వీడియోలో వారిద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ మురిసిపోతున్నట్లు కన్పించగా దాన్ని ఊర్వశి పోస్టు చేయడం పట్ల నెటిజన్లు సీరియస్ అవుతున్నారు.

రిషబ్ పంత్‌ను ఇబ్బంది పెట్టేందుకే ఊర్వశి ఈ స్టోరీ పెట్టిందంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు. కొందరు అయితే పంత్‌ను సైడ్ చేసి నషీమ్ షాను పట్టాలెక్కించే ప్రయత్నంలో ఉందంటూ పేర్కొన్నారు. మరికొందరు అయితే ఫన్నీ మీమ్స్ పోస్ట్ చేస్తూ ఆమెపై కామెంట్లు జోరుగా చేస్తున్నారు.

ఆంటీ వదిలేయండి ప్లీజ్

ఇక ఊర్వశి నషీమ్ షా మధ్య నవ్వులు చిందించే ఈ పోస్టుపై ఓ నెటిజన్ సరదా పోస్టు చేశాడు. వీరిద్దరి మధ్య వయసు తేడాను ప్రస్తావిస్తూ ఈ పోస్టులో ఫన్నీగా కార్టూన్లను ఉపయోగించి మీమ్ చేశాడు. ఆంటీ నా వయసు ఇప్పుడు 19 ఏళ్లే నన్ను వదిలేయండి ప్లీజ్ అంటూ నషీమ్ షా కార్టూన్ పాత్ర అనగా.. అయితే ఏంటీ చాలా క్యూట్‌గా ఉంటావ్.. ఇటు రా ఊర్వశి ఆంటీ అతని వెంట పరిగెత్తుతుంది.

చూస్తున్నా అంతా చూస్తున్నా

మరో నెటిజన్ ఇటీవల అర్షదీప్ సింగ్ క్యాచ్ మిస్ చేసినప్పుడు రోహిత్ ఫైర్ అయిన స్టిల్ నెట్టింట తెగ వైరలైన సంగతి తెలిసిందే. ఈ రోహిత్ స్టిల్‌ను పోస్ట్ చేస్తూ.. తనకు ఊర్వశి పెట్టిన పోస్టు చూసి ఎంత చిర్రెత్తుకొస్తుందో చెప్పకనే చెప్పేశాడు. మరో మీమ్‌లో ఓ గర్ల్ ఓ పిల్లాడిని తదేకంగా చూస్తుంటే.. ఆ పిల్లాడు తెగ సిగ్గుపడిపోతుంటాడు. దాన్ని ఊర్వశి, నషీమ్ షాలకు యాప్ట్ అయ్యేలా క్రియేట్ చేశాడు. మరొకరు ఊర్వశి పెట్టిన పోస్టుకు ఓ మెలోడితో మీమ్ చేశాడు. ఇందులో రౌటేలా నసీమ్ షా కోసం డ్యూయెట్ పాడుతుండగా.. చూస్తున్న అంతా చూస్తున్నా అనేలా రిషబ్ పంత్ పక్క నుంచి అబ్జర్వ్ చేస్తుంటాడు. ఇకపోతే ఊర్వశి బుట్టలో నసీమ్ షా పడతాడో లేదో చూడాలి మరీ.

Story first published: Wednesday, September 7, 2022, 14:37 [IST]
Other articles published on Sep 7, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+