Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నటాషాతో పాండ్యా ఎంగేజ్‌మెంట్‌.. హార్ధిక్‌ మాజీ ప్రియురాలు ఏమందంటే?!!

Urvashi Rautela congratulates rumoured Hardik Pandya on engagement

ముంబై: టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నాడు. సెర్బియా నటి, మోడల్‌ నటాషా స్టాన్‌కోవిచ్‌ను త్వరలో వివాహమాడనున్నాడు. నూతన సంవత్సరం వేడుకల్లో భాగంగా దుబాయ్‌లో మంగళవారం పాండ్యా-నటాషాలు ఓ హ్యాచ్‌లో ప్రయాణిస్తూ రింగ్స్‌ మార్చుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బుధవారం హార్దిక్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు.

 మాజీ ప్రియురాలి విషెష్‌:

మాజీ ప్రియురాలి విషెష్‌:

హార్దిక్‌ పాండ్యా నిశ్చితార్థం విషయం తెలిసి టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో పాటు ఇతర క్రికెటర్లు, నటీనటులు సోషల్‌ మీడియా వేదికగా విషెస్‌ తెలిపారు. ఇక పాండ్యా మాజీ ప్రియురాలు, బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌతేలా కూడా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపింది. 'నటాషా-పాండ్యా జంటకు ప్రత్యేక శుభాకాంక్షలు. మీ బంధం ఎప్పుడూ ప్రేమతో, ఆనందంతో ఉండాలని కోరుకుంటున్నా' అని పాండ్యా పోస్టుకు కామెంటు పెట్టింది.

స్పందించిన మాజీ ప్రియుడు:

స్పందించిన మాజీ ప్రియుడు:

మరోవైపు నటాషా పోస్టుపై ఆమె మాజీ ప్రియుడు, టీవీ నటుడు అలై గోని స్పందించాడు. హార్ట్‌ సింబల్‌తో కూడిన ఎమోజీ పోస్ట్‌ చేశాడు. ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయకుండా కేవలం హార్ట్‌ సింబల్‌ను మాత్రమే గోని పోస్ట్ చేయడం విశేషం. గతంలో నటాషా, గోనిలు ప్రేమలో ఉన్నారు. నాచ్‌బేలియెలో వీరిద్దరికి పరిచయం. ఏమైందో తెలియదుకానీ నటాషా, గోనిలు విడిపోయారు.

కోలుకుంటున్న పాండ్యా:

కోలుకుంటున్న పాండ్యా:

గత సెప్టెంబర్‌లో దక్షిణాఫ్రికాతో సిరీస్‌ తర్వాత వెన్ను నొప్పితో హార్దిక్‌ పాండ్యా ఆటకు దూరమయ్యాడు. లండన్‌లో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, వెస్టిండీస్ సిరీస్‌లకు దూరమయ్యాడు. ఇటీవలే మళ్లీ ప్రాక్టీస్‌ మొదలుపెట్టిన హార్దిక్‌.. పునరాగమనం కోసం వెయిట్‌ చేస్తున్నాడు. ఇప్పుడిప్పుడే గాయం నుంచి కోలుకుంటున్న పాండ్యా ఈ నెలాఖరులో ప్రారంభమయ్యే కివీస్‌ పర్యటనకు వెళ్లే అవకాశముంది.

బిగ్‌బాస్‌తో క్రేజ్‌:

బిగ్‌బాస్‌తో క్రేజ్‌:

ప్రకాశ్‌ ఝా దర్శకత్వం వహించిన 'సత్యాగ్రహ' చిత్రంతో నటాషా స్టాన్‌కోవిచ్‌ బాలీవుడ్‌లోకి తెరంగేట్రం చేసింది. బిగ్‌బాస్‌ (హిందీ 8)లో పోటీపడటంతో ఆమెకు క్రేజ్‌ పెరిగింది. ఆమె ప్రస్తుతం పలు టీవీ కార్యక్రమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉంది. సెర్బియాలో పుట్టిన నటాషా ముంబైలోనే స్థిరపడింది.

Story first published: Friday, January 3, 2020, 10:58 [IST]
Other articles published on Jan 3, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+