కలత చెందాను, బాధించింది: యూరీ ఉగ్రదాడిపై కోహ్లీ (వీడియో)
కాన్పూర్: జమ్మూ కాశ్మీర్ యూరీ సెక్టార్‌లోని సైనిక శిబిరంపై జరిగిన ఉగ్రదాడిపై మాత్రమే తాను స్పందించలగలను కానీ, దానికి పరిష్కారం మాత్రం కనుగొనలేనని టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నారు. కాన్పూర్ వేదికగా జరిగిన చారిత్రాత్మక 500వ టెస్ట్ మ్యాచ్‌లో కివీస్‌పై విజయం సాధించిన తర్వాత కోహ్లీ మీడియాతో మాట్లాడారు.

యూరీ ఉగ్రదాడిపై స్పందించాలని మీడియా కోరగా కోహ్లీ పైవిధంగా స్పందించాడు. ఇలాంటి ఘటనలు జరగంపై ఒక భారతీయుడిగా ఎంతో ఆవేదన చెందుతున్నానని కోహ్లీ తన బాధను వ్యక్తం చేశాడు. భారతీయుడిగా తాను వీర జవాన్ల కుటుంబాలకు తన సంతాపం మాత్రమే తెలియజేయగలనని అన్నారు.
యూరీ ఉగ్రదాడికి సంబంధించిన పరిష్కారంపై కామెంట్ చేసే స్థాయిలో తాను లేనని చెప్పుకొచ్చాడు. కాశ్మీర్‌లోని యూరీ సెక్టార్‌లో జరిగిన ఉగ్రదాడిలో 18 మంది భారత సైనికులు చనిపోయిన సంగతి తెలిసిందే. అంతక ముందు ట్విట్టర్ వేదికగా యూరీ ఉగ్రదాడిలో అమరులైన భారత జవాన్ల కుటుంబాలకు కోహ్లీ తన సంతాపాన్ని తెలిపాడు.
#TeamIndia skipper @imVkohli pays homage to the martyrs of #UriAttack and condolences to their families pic.twitter.com/ZiZ0YsW2KW
— BCCI (@BCCI) September 26, 2016
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications