For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

4 మ్యాచ్‌లలో 3 ఓటమి: నోరు పారేసుకున్న ప్రీతి, సెహ్వాగ్‌ మెంటార్‌గా తప్పుకున్నాడా?

‘Upset’ Preity Zinta in verbal altercation with Virender Sehwag

హైదరాబాద్: భారత మాజీ క్రికెటర్, పంజాబ్ జట్టు మెంటార్ వీరేందర్ సెహ్వాగ్‌పై పంజాబ్ జట్టు సహ యజమాని ప్రీతి జింతా నోరుపారేసుకుంది. ఐపీఎల్ 11సీజన్‌కు జట్టు మెంటార్‌గానే కాకుండా, ఇంకా కొన్ని కీలక బాధ్యతలు వహిస్తోన్న సెహ్వాగ్‌పై ప్రీతి నిప్పులు చెరిగింది. ఈ విషయంపై పలు కారణాలున్నాయని సమాచారం. ఆఖరి నుంచి వరుసగా జరిగిన 4మ్యాచ్ లలో మూడింటిలోనూ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఓడిపోయింది.

మే 8 మంగళవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన సమయంలో పంజాబ్ కొద్దిపాటి ప్రయోగాలతో క్రీజులోకి వచ్చింది. బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పు చేసి రవిచంద్రన్ అశ్విన్ మూడో స్థానంలోనే బ్యాటింగ్‌కు పంపింది. కేవలం 2బంతులు మాత్రమే ఆడి 0 పరుగులతో వెనుదిరిగాడు. మ్యాచ్ ఓడిపోవడంలో ఈ విషయాన్ని కీలకంగా భావించిన ప్రీతి జింతా మ్యాచ్ అనంతరం సెహ్వాగ్‌తో చర్చించారట.

వైఫల్యమంతా సెహ్వాగ్‌దే అన్నట్లుగా తిట్టిపోసిందట

వైఫల్యమంతా సెహ్వాగ్‌దే అన్నట్లుగా తిట్టిపోసిందట

మార్పులకు ఫలితంగా నిరుత్సాహపరచడంతో వైఫల్యమంతా సెహ్వాగ్‌దే అన్నట్లుగా తిట్టిపోసిందట. ఆవిడకు బదులిచ్చేందుకు, శాంతపరిచేందుకు సెహ్వాగ్ ప్రయత్నించినా అవేమీ పట్టించుకోలేదని ప్రముఖ ఇంగ్లీషు పత్రిక ప్రచురించింది. దీంతో విసుగు చెంది మిగతా భాగస్వాముల దగ్గర ప్రస్తావించాడట.

ఏ మాత్రం ఒత్తిడికి గురి చేయకూడదనే

ఏ మాత్రం ఒత్తిడికి గురి చేయకూడదనే

ఈ విషయం జట్టు ఆటగాళ్లెవరితోనూ చర్చించకపోవడం సెహ్వాగ్ నాయకత్వ లక్షణాలను వ్యక్తపరుస్తోంది. జట్టును ఏ మాత్రం ఒత్తిడికి గురి చేయకూడదనే సెహ్వాగ్ ఇలా చేశాడని సమాచారం. ప్రీతి జింతాతో పాటు సహ యజమాని అయిన మోహిత్ బర్మన్ మాట్లాడుతూ.. 'ఆ సందర్భంలో స్టేడియంలో లేను. అది కేవలం మ్యాచ్ అనంతరం జరిగిన చర్చ మాత్రమే' అని ఆయన పేర్కొన్నాడు.

ఆరంభం నుంచి మంచి దూకుడుగా

ఆరంభం నుంచి మంచి దూకుడుగా

ఐపీఎల్ ఆరంభం నుంచి ఒక్కసారి కూడా ట్రోఫీని గెలుచుకోని పంజాబ్ ఈ ఏడాది ఆరంభం నుంచి మంచి దూకుడుగా ఆడింది. ఐపీఎల్ వేలం నుంచే సెహ్వాగ్ జట్టులో కీలకంగా వ్యవహరించాడు. జట్టు కెప్టెన్‌గా రవిచంద్రన్ అశ్విన్‌ను ఎంపిక చేయడంలోనూ, వేలం ఆఖరి సమయంలో క్రిస్ గేల్‌ను కొనుగోలు చేయడంలోనూ అతనిదే పైచేయి.

ప్రీతి జింతాకు ఆగ్రహం కొత్తేమీ కాదు:

ప్రీతి జింతాకు ఆగ్రహం కొత్తేమీ కాదు:

ప్రీతి జింతాకు ఇలా జట్టుకు సంబంధించిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడం కొత్తేమీ కాదు. 2016వ సంవత్సరంలో పంజాబ్ జట్టు కోచ్‌గా వ్యవహరించిన సంజయ్ బంగర్‌ను ఇలాగే తిట్లిపోసింది. ఆ ఘటన తర్వాత ప్రీతి జింతాను ఎద్దేవా చేస్తూ పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. ఇదే సీజన్‌లోనూ స్టేడియంలో మ్యాచ్ చూసేందుకు వచ్చిన వారిపై ఇలాగే ఆగ్రహం వ్యక్తం చేసి వార్తల్లో నిలిచారు ప్రీతి.

ముంబై మిర్రర్‌‌ మరోసారి తప్పులో కాలేసింది: ప్రీతి జింతా

ముంబై మిర్రర్‌‌ మరోసారి తప్పులో కాలేసింది: ప్రీతి జింతా

ఈ వార్తలపై ప్రీతి ట్విటర్‌ ద్వారా స్పందిస్తూ ‘ముంబై మిర్రర్‌‌ మరోసారి తప్పులో కాలేసింది. మేము మీడియాను పట్టించుకోము. అలాగే వారికి ప్రత్యేకంగా వార్తలు రాయమని డబ్బులు ఇవ్వం. దీంతో ఖాళీగా ఉన్న వారు వారికి నచ్చిన రీతిలో ఏవేవో కథనాలు రాస్తూ ఉంటారు. వీరూకి నాకు మధ్య జరిగిన సంభాషణ నిజమే. కానీ, ఆ సంభాషణ దేని గురించి జరిగిందో యథాతథంగా రాయలేదు. దాన్ని పూర్తిగా తప్పుదోవ పట్టించారు. దీంతో ఒక్కసారిగా నన్ను విల‌న్‌ని చేసేశారు. వావ్‌' అని పేర్కొన్న ప్రీతి ఫేక్‌న్యూస్‌ అన్న హ్యాష్‌ట్యాగ్‌ను జత చేసింది.

Story first published: Friday, May 11, 2018, 23:29 [IST]
Other articles published on May 11, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+