For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఉప్పల్ స్టేడియంలో జరిగే ఇండియా వర్సెస్ ఆసీస్ మ్యాచ్ టిక్కెట్లు నేడు రాత్రి 8గంటలకు రిలీజ్.. వివరాలివే..!

Uppal stadium Tickets for India vs Australia 3rd T20I Available From 8pm on Paytm Website

సుమారు రెండున్నరేళ్ల విరామం తర్వాత.. మన హైదరాబాద్‌ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఇంటర్నేషనల్ మ్యాచ్ జరగబోతుంది. ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ మధ్య సెప్టెంబర్ 20నుంచి మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుండగా.. చివరిదైన మూడో టీ20 మ్యాచ్ సెప్టెంబర్ 25న ఆదివారం హైదరాబాద్‌లోనే జరగనుంది. ఈ మ్యాచ్ కోసం యావత్ హైదరాబాద్ ప్రజలతో పాటు ఇరు రాష్ట్రాల అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఐపీఎల్, ఇంటర్నేషనల్ మ్యాచ్ సందడి లేక ఉప్పల్ స్టేడియం చాన్నాళ్లుగా బోసిపోయింది. ఎట్టకేలకు ఉప్పల్ వేదికగా మ్యాచ్ జరగబోతుండడంతో ప్రేక్షకులు లైవ్ మ్యాచ్ చూసేందుకు పెద్దఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు. పైగా టీ20 వరల్డ్ కప్ ముంగిట జరగబోయే కీలక సిరీస్‌లో భాగమైన ఈ మ్యాచ్ పట్ల కూడా అభిమానులు ఫుల్ క్యురియాసిటీతో రెడీ అయ్యారు.

పేటీఎం వెబ్‌సైట్లో రాత్రి..

పేటీఎం వెబ్‌సైట్లో రాత్రి..

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ మ్యాచ్ ఏర్పాట్లలో పూర్తిగా నిమగ్నమయ్యారు. మూడో టీ20 మ్యాచ్ టిక్కెట్లు Paytm ఇన్‌సైడర్ యాప్‌లో సెప్టెంబర్ 15 నేటి నుండి అమ్మకానికి అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. పేటీఎం లేదా పేటీఎం ఇన్ సైడర్ వెబ్ సైట్లో ఈ టికెట్లు ఈ రోజు మధ్యాహ్నం 12గంటలకు ఓపెన్ అవుతాయని అంతా అనుకుంటుండగా.. ఎంతకీ ఆ టైంకి టిక్కెట్లు రిలీజ్ కాలేదు.

పైగా యూజర్లు కూడా పేటీఎం యాప్‌లో ప్రయత్నించగా.. అసలు లింకు కూడా కన్పించలేదు. దీంతో కాస్త అసహనానికి గురయ్యారు. ఇక తాజాగా బీసీసీఐ అఫిలియేట్ అసోసియేషన్ అయిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఈ విషయమై ప్రకటన జారీ చేసింది. నేడు రాత్రి 8గంటలకు పేటీఎం వెబ్ సైట్లో టిక్కెట్ల సేల్ లైవ్ స్టార్టవుతుందని పేర్కొంది.

హాట్‌హాట్‌గా అమ్మకాలు త్వరపడాల్సిందే..

ఇక మ్యాచ్ చూడాలనుకునేవారు ఆన్ లైన్లో వీలయినంత తొందరగా బుక్ చేసుకుంటే బెటర్. సుమారు 55వేల కెపాసిటీతో ఉన్న ఉప్పల్ స్టేడియం టిక్కెట్లలో 10శాతం మేర స్టూడెంట్ కోటాకు పోయినా.. మిగిలినవాటిలో కొన్ని రిజర్వ్‌డ్ అయినా.. ఇంకా 40వేల చిల్లర టిక్కెట్లు ఉంటాయి. అందులో కొంత ఆఫ్ లైన్ కోటా ఉంటుంది. దీంతో టిక్కెట్లు హాట్ హాట్‌‌గా సేల్ అవుతాయి.

తొందరగా బుక్ చేసుకుంటేనే టిక్కెట్ దక్కొచ్చు. టికెట్ ధరలు రూ.850నుంచి ప్రారంభం కానున్నాయి. జీఎస్టీ అదనంగా పడే వీలుంది. టిక్కెట్లు స్టేడియం కౌంటర్లలో ఆఫ్‌లైన్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు. అయితే మ్యాచ్‌కు ముందు రోజు నుంచి ఆఫ్ లైన్ టిక్కెట్లు అందుబాటులోకి వస్తాయి. స్టూడెంట్లు తమ ఐడీ కార్డులు చూపించి స్టేడియం వద్ద రాయితీ టిక్కెట్లు మ్యాచ్ ముందు రోజు నుంచి కొనుక్కోవచ్చు.

మ్యాచ్ రోజు భారీ బందోబస్తు

మ్యాచ్ రోజు భారీ బందోబస్తు

సెప్టెంబర్ 25న ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ పరిసరాల్లో భారీ బందోబస్తు చర్యలు తీసుకుంటామని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. ఇక ఆసీస్ - భారత్ మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ స్టేడియం వద్ద ట్రాఫిక్ జామ్ కాకుండా నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. పార్కింగ్ సమస్యలు లేకుండా ముందస్తు ప్రకటనలు కూడా జారీ చేయనున్నారు. మెట్రో రైళ్లను సాయంత్రం ప్రత్యేకంగా నడిపే వీలుంది.

ఆస్ట్రేలియాతో మూడో టీ20కి బరిలో దిగే భారత జట్టు

ఆస్ట్రేలియాతో మూడో టీ20కి బరిలో దిగే భారత జట్టు

రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, ఆర్. అశ్విన్, యుజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, మొహమ్మద్. షమీ, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా

Story first published: Thursday, September 15, 2022, 14:55 [IST]
Other articles published on Sep 15, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+