
రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా స్థానాలు మెరుగు..
ఇక విరాట్ కోహ్లీ ర్యాంకింగ్స్‌లో 4వ స్థానానికి పడిపోయాడు. 33ఏళ్ల కోహ్లీ.. 2011 నుంచి నంబర్ 5కంటే దిగువకు పడిపోలేదు. అతను చివరిసారిగా 2015 అక్టోబర్‌లో మొదటి మూడు స్థానాల నుంచి దిగజారాడు. ఇటీవల టెస్ట్‌లో సైతం టాప్ 10లో నుంచి కోహ్లీ దిగజారాడు. ఇక బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో రిషబ్ పంత్ బాగా మెరుగయ్యాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో పంత్ (125పరుగులు నాటౌట్) మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన పంత్ 25స్థానాలు ఎగబాకి 52వ స్థానానికి చేరుకున్నాడు. అలాగే హార్దిక్ పాండ్యా 55బంతుల్లో 71పరుగులు చేసి విలువైన ఇన్నింగ్స్ ఆడడంతో 42వ స్థానానికి చేరుకున్నాడు.

మున్నాళ్ల ముచ్చటగా బుమ్రా అగ్రస్థానం
ఇక ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో 4 వికెట్లు తీసిన పాండ్యా 25స్థానాలు ఎగబాకి 8వ స్థానానికి చేరుకున్నాడు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో జస్ప్రీత్ బుమ్రా తొలి వన్డేలో ఆరు వికెట్లు పడగొట్టి అగ్రస్థానానికి చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే మూడో మ్యాచ్‌లో అతను ఆడకపోవడంతో మళ్లీ నంబర్ 2కి పడిపోయాడు. ట్రెంట్ బౌల్ట్ ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

ఐసీసీ మెన్స్ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్, రేటింగ్ పాయింట్లు
1.బాబర్ ఆజం - 892
2. ఇమామ్-ఉల్-హక్ - 815
3. రాస్సీ వాన్ డెర్ డస్సెన్ - 796
4.విరాట్ కోహ్లీ - 790
5. రోహిత్ శర్మ - 786
6. క్వింటన్ డి కాక్ - 780
7. రాస్ టేలర్ - 752
8. డేవిడ్ వార్నర్ - 880
9. జానీ బెయిర్‌స్టో - 736
10. ఆరోన్ ఫించ్ - 715

ఐసీసీ మెన్స్ వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్, రేటింగ్ పాయింట్లు
1. ట్రెంట్ బౌల్ట్ - 704
2. జస్ప్రీత్ బుమ్రా - 703
3. షాహీన్ అఫ్రిది - 681
4. జోష్ హాజిల్‌వుడ్ - 679
5. ముజీబ్ ఉర్ రెహమాన్ - 676
6. మెహెదీ హసన్ - 672
7. మాట్ హెన్రీ - 670
8. మొహమ్మద్ నబీ - 657
9. క్రిస్ వోక్స్ - 653
10. రషీద్ ఖాన్ - 651

ఐసీసీ మెన్స్ వన్డే ఆల్రౌండర్స్ ర్యాంకింగ్స్, రేటింగ్ పాయింట్లు
1. షకీబ్ అల్ హసన్ - 394
2.మొహమ్మద్ నబీ - 325
3. రషీద్ ఖాన్ - 290
4.మిచెల్ సాంట్నర్ - 253
5.కోలిన్ డి గ్రాండ్‌హోమ్ - 246
6. క్రిస్ వోక్స్ - 245
7.మెహెదీ హసన్ - 243
8.హార్దిక్ పాండ్యా - 242
9.జీషన్ మక్సూద్ - 238
10.ఇమాద్ వాసిం - 234


Click it and Unblock the Notifications












