వేలి గాయం ఎంత పనిచేసింది? టోర్నీ మొత్తానికి ధోని దూరమేనా?

లీడ్స్: ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భాగంగా శనివారం లీడ్స్‌లోని హెడింగ్లే కార్నేజ్ స్టేడియంలో శ్రీలంకతో జరిగే లీగ్ మ్యాచ్‌లో వికెట్ కీపర్, మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ మహేంద్రసింగ్ ధోనీ ఆడేది అనుమానంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌లో ఆడటానికి ఇదివరకే లీడ్స్‌కు చెరుకున్న భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం హెడింగ్లే స్టేడియంలో ముమ్మరంగా నెట్ ప్రాక్టీస్ చేస్తోంది. నెట్ ప్రాక్టీస్ సెషన్స్‌లో ధోనీ పెద్దగా కనిపించట్లేదు. అప్పుడప్పుడూ వచ్చిపోతున్నాడంతే! దీన్ని బట్టి చూస్తోంటే- శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో ధోనీ ఆడకపోవచ్చని తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం- ఆయన వేలిగాయం.
ధోనీకి గాయం ఎప్పుడైందో, ఎలా అయిందో కూడా తెలియట్లేదు గానీ.. ఇంగ్లండ్‌తో మ్యాచ్ అనంతరం ఆయన వేలిని నోట్లో ఉంచుకోవడం, రక్తాన్ని ఉమ్మివేయడం కనిపించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు వైరల్‌గా మారాయి. ఇంగ్లండ్‌తో మ్యాచ్ ఓడిపోవడానికి శ్లాగ్ ఓవర్లలో ధోనీ నెమ్మదిగా ఆడటమే కారణమంటూఆ గాయంతోనే- ఆయన బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఆడారు. సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యారు. అయినప్పటికీ.. తన గాయాన్ని ధోనీ బయటపెట్టుకునే ప్రయత్నం చేయలేదు.
వేలిగాయంతోనే ఆయన బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఆడారు. ఆ మ్యాచ్‌లో కూడా శ్లాగ్ ఓవర్లలో ధోనీ ఇన్నింగ్ కాస్త నింపాదిగానే సాగింది. భారీ షాట్లకు దిగలేదు. సింగల్స్ తీయడానికే ప్రాధాన్యత ఇచ్చారు. ఆ మ్యాచ్‌లో కూడా ధోనీ వైఖరి ఏ మాత్రం మారలేదని అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. వాటన్నింటికీ ధోనీ ఏనాడూ సమాధానం చెప్పుకోలేదు. తాజాగా- ఆయన వేలి గాయం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఈ గాయం కారణంగా- శనివారం హెడింగ్లేలో శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో ఆడకపోవచ్చని అంటూ వార్తలు వస్తున్నాయి.
టీమిండియా ఇప్పటికే సెమీఫైనల్‌కు చేరుకున్నందున- శ్రీలంకతో మ్యాచ్‌కు పెద్దగా ప్రాధాన్యత అనేది లేదు. ఈ నేపథ్యంలో- ధోనీకి విశ్రాంతి కల్పించాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. సెమీఫైనల్ మ్యాచ్ నాటికి ఆయన పూర్తిగా సనద్ధమయ్యేలా వీలు కల్పించాలని టీమ్ మేనేజ్‌మెంట్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన కూడా వెలువడలేదు. అయినప్పటికీ.. శ్రీలంకతో మ్యాచ్‌లో ధోనీ ఆడకపోవచ్చనేది ఖాయమేనని అంటున్నారు. ధోనీ వేలి గాయం గురించి ఏ మాత్రం భయపడాల్సిన పని లేదని టీమ్ మేనేజ్‌మెంట్ చెబుతోంది. 300లకు పైగా వన్డే మ్యాచ్‌లను ఆడిన ధోనీ ఓ పర్వతం లాంటి ఆటగాడని, ఇలాంటివి లెక్కచేయరని స్పష్టం చేస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications