Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆనందమంటే ఇదే: భారత ఓటమిపై బంగ్లా కెప్టెన్, క్షమాపణ

ముంబై: బంగ్లాదేశ్ కెప్టెన్ ముష్ఫికర్‌ రహీమ్‌ ట్విట్టర్‌లో మరోసారి అత్యుత్సాహాన్ని ప్రదర్శించాడు. టీ20లో భాగంగా ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టును చిత్తు చేసి వెస్టిండిస్ జట్టు పైనల్‌కు వెళ్లింది. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో భారత బౌలర్ల వైఫల్యం కనిపించింది.

గురువారం రాత్రి భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య జరిగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 193 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండిస్... సిమ్మన్స్‌ 51 బంతుల్లో 82 పరుగులు చేయడంతో 7 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. వెస్టిండిస్ జట్టు గెలిచిన అనంతరం బంగ్లా కెప్టెన్ ముష్ఫికర్‌ రహీమ్‌ ట్విట్టర్‌లో అత్యుత్సాహాన్ని ప్రదర్శించాడు.

Unsporting: Mushfiqur Rahim says India's WT20 semis loss is 'happiness' for him, apologises later

'ఆనందమంటే ఇదే.. హాహాహా! సెమీస్‌లో భారత్‌ ఓడిపోయింది' అంటూ మ్యాచ్ అనంతరం ధోని మాట్లాడే ఫోటోతో సహా ట్వీట్ చేశాడు. భారత్‌ ఓటమితో నిరాశచెందిన అభిమానులకు ఈ ట్వీట్‌ మరింత ఆగ్రహానికి గురి చేసింది. ఈ ట్వీట్‌పై అటు ముష్ఫికర్‌‌లతో పాటు భారతీయ అభిమానుల సైతం అతడి చేష్టలను తీవ్రంగా తప్పుబడుతూ పెద్ద ఎత్తున కామెంట్స్ చేశారు.

దీంతో రహీమ్ తన ట్వీట్‌ను డిలీట్‌ చేశాడు. ఆ తర్వాత తాను ఆ వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు కోరాడు. ' అందరికీ సారీ.. వెస్టిండీస్‌కు నేను పెద్ద మద్దతుదారుడిని. అయినప్పటికీ పరుషమైన వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు కోరుతున్నా' అని పేర్కొన్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+