For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రికెట్ చరిత్రలోనే కనివిని ఎరుగని ఘటన.. ఒకే ఓవర్‌లో 77 పరుగులు!!

Unrecorded bowling action: Bert Vance concedes 77 runs off one over

హైదరాబాద్: క్రికెట్ ఆటలో ఏదైనా సాధ్యమే. ఎవరూ ఊహించని రికార్డులు బద్దలవడం. రికార్డు బౌలింగ్ గణాంకాలు నమోదవడం ఇలా అన్ని సాధ్యమవుతున్నాయి. సాధారణంగా ఓ బౌలర్ ఒక ఓవర్‌లో 6-10 పరుగులు ఇస్తుంటాడు. ఇక 10-20 ఇచ్చిన ఘటనలు కూడా ఉన్నాయి. ఒక్కో సందర్భంలో 30పైగా కూడా ఇస్తుంటాడు. అయితే ఒకే ఓవర్‌లో 77 పరుగులు ఇచ్చిన ఘటన కూడా ఉంది. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలు విషయంలోకి వెళితే...

108 పరుగులకే 8 వికెట్లు:

108 పరుగులకే 8 వికెట్లు:

1990 ఫిబ్రవరి 20న న్యూజిలాండ్‌లోని ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో 77 పరుగులు నమోదయిన ఘటన చోటుచేసుకుంది. సరిగ్గా 30 ఏళ్ల క్రితం వెల్లింగ్టన్‌, కాంటర్‌బరీ జట్ల మధ్య ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ మ్యాచ్‌ జరిగింది. వెల్లింగ్టన్‌ టైటిల్‌ సాధించాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితి అది. చివరి రోజు రెండో ఇన్నింగ్స్‌లో కాంటర్‌బరీకి వెల్లింగ్టన్‌ 59 ఓవర్లలో 291 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్య ఛేదనలో కాంటర్‌బరీ 108 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి ఓటమికి చేరువయింది.

2 ఓవర్లలో 95 పరుగులు:

2 ఓవర్లలో 95 పరుగులు:

క్రీజులో ఎల్‌కే జర్మన్‌ (160 నాటౌట్‌), రోజర్‌ ఫోర్డ్‌ (14 నాటౌట్‌) ఉన్నారు. ఇక కాంటర్‌బరీ గెలవడానికి 2 ఓవర్లలో 95 పరుగులు చేయాలి. ఇది అసాధ్యం కాబట్టి ఉన్న రెండు వికెట్లను కాపాడుకుని మ్యాచ్‌ను డ్రా చేసుకోవాలని జర్మన్‌, ఫోర్డ్‌ పట్టుదలతో ఉన్నారు. మరోవైపు 2 ఓవర్లలో రెండు వికెట్లు తీస్తే.. వెల్లింగ్టన్‌ విజయాన్ని అందుకుంటుంది. ఎలాగైనా గెలవాలని వెల్లింగ్టన్‌ కెప్టెన్‌ మెక్‌ స్వీనే బంతిని బ్యాట్స్‌మన్‌ అయిన బెర్ట్‌ వాన్స్‌కు ఇచ్చాడు.

ఒకే ఓవర్‌లో 77 పరుగులు:

ఒకే ఓవర్‌లో 77 పరుగులు:

బెర్ట్‌ వాన్స్‌ ఆ ఓవర్‌లో ఏకంగా 22 బంతులు వేసాడు. ఇందులో 17 నోబాల్స్ ఉండడం విశేషం. ఇన్ని నోబాల్స్ అనుకుంటే.. అంపైర్‌ ఒక బంతిని లెక్కించడంలో పొరపాటు పడ్డాడు. ఇక జర్మన్‌ ఎనిమిది సిక్సులు, ఐదు ఫోర్లు బాదడంతో ఆ ఓవర్‌లో మొత్తం 77 పరుగులొచ్చాయి. ఈ క్రమంలోనే జర్మన్‌ సెంచరీ చేసాడు. జర్మన్‌ ఈ ఓవర్‌కు ముందు 75 పరుగులతో క్రీజులో ఉండే. జర్మన్‌ వీరబాదుడుతో కాంటర్‌బరీ విజయాన్ని చేరువైంది.

చివరి ఓవర్‌లో 18 పరుగులు:

చివరి ఓవర్‌లో 18 పరుగులు:

కాంటర్‌బరీ చివరి ఓవర్‌లో 18 పరుగులు చేస్తే విజయం సాదిస్తుంది. జర్మన్‌ ఊపుచూస్తే.. కాంటర్‌బరీ సునాయాసంగా గెలిచేదిగా కనిపించింది. ఇవాన్‌ గ్రే వేసిన చివరి ఓవర్‌లో జర్మన్‌ 5 బంతుల్లో 17 పరుగులు చేశాడు. ఇక చివరి బంతికి ఒకే ఒక్క సింగిల్‌ తీస్తే.. కాంటర్‌బరీని విజయం వరిస్తుంది. చివరి బంతిని ఎదుర్కొన్న రోజర్‌ ఫోర్డ్‌ ఒక పరుగు కూడా తీయలేదు. దీంతో మ్యాచ్ డ్రా అయింది. జర్మన్‌ వీరోచిత ఇన్నింగ్స్ వృధా అయింది.

రికార్డుల్లోకి ఎక్కలేదు:

రికార్డుల్లోకి ఎక్కలేదు:

బెర్ట్‌ వాన్స్‌ ఒక ఓవర్లో 77 పరుగులు ఇచ్చి తన పేరుపై చెత్త రికార్డు నమోదు చేసుకున్నాడు. ఏమైందో తెలియదు కానీ.. ఈ చెత్త రికార్డు క్రికెట్ చరిత్ర రికార్డుల్లోకి ఎక్కలేదు. తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బహుశా భవిష్యత్తులో కూడా ఇన్ని పరుగులు ఏ బౌలర్ ఇవ్వడు కూడా. 77 పరుగులు ఇచ్చిన చెత్త రికార్డు వాన్స్‌పైనే ఉంటుంది.

Story first published: Thursday, February 20, 2020, 16:06 [IST]
Other articles published on Feb 20, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+