
హైదరాబాద్: భారత్‌లోకి టిక్ టాక్ ప్రవేశించిన తర్వాత వీడియో కంటెంట్ ఒక్కసారిగా వైరల్ అవుతోంది. ఇప్పటికే పలు వీడియోలు పాపులర్ అయ్యాయి. ఇలాంటి వాటిల్లో డైపర్ వేసుకున్న ఓ చిన్నారి బ్యాటింగ్ చేస్తోన్న వీడియో ఒకటి. ఈ వీడియోకి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం ఫిదా అయ్యాడు.
ప్లాస్టిక్ బ్యాట్ పట్టిన ఓ చిన్నారి స్ట్రైట్ డ్రైవ్‌లు, కవర్ డ్రైవ్‌లు ఆడుతున్న వీడియోని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ట్యాగ్ చేశాడు. "అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన కలిగిన ఆ బుడ్డోడిని టీమిండియా కెప్టెన్ భారత జట్టులో చేర్చుకుంటావా?" అని కామెంట్ పెట్టాడు.
ఈ వీడియోని చూసిన కోహ్లీ ఆ చిన్నారి బ్యాటింగ్‌కు ముగ్థుడయ్యాడు. ఆ చిన్నోడి ప్రతిభ నమ్మశక్యంగా లేదని.. అతడు ఎక్కడుంటాడని కోహ్లీ ఈ సందర్భంగా ప్రశ్నించాడు. కాగా, ప్రస్తుతం కోహ్లీ వెస్టిండిస్‌తో వన్డే సిరిస్‌కు సన్నద్ధమవుతున్నాడు. కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా మూడు టీ20ల సిరిస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.ఆ తర్వాత మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య ఆదివారం తొలి వన్డే చెన్నైలో జరగనుంది.