Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్రికెట్ చరిత్రలో మరో సంచలనం: 148 ఏళ్లలో ఇదే తొలిసారి!

క్రికెట్‌లో ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు నమోదవుతూనే ఉంటాయి. కానీ కొన్ని రికార్డులు మాత్రమే చరిత్రలో నిలిచిపోతాయి. అలాంటి ఓ అరుదైన, కానీ అపకీర్తిని తెచ్చి పెట్టే రికార్డు కెనడా జట్టు పేరు నమోదు కావడం గమనార్హం. అంతర్జీతీయ క్రికెట్ చరిత్రలో గత 148 ఏళ్లలో ఎన్నడూ జరగని అరుదైన సంఘటన ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లీగ్ 2 మ్యాచ్‌లో జరిగింది. స్కాట్లాండ్, కెనడా జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో కెనడా ఓపెనర్లు ఓ చెత్త రికార్డును నమోదు చేశారు. మ్యాచ్ మొదటి రెండు బంతుల్లోనే ఇద్దరు ఓపెనర్లు ఔట్ కావడం విశేషం. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో గత 148 ఏళ్లలో ఇలా జరగడం ఇదే మొదటిసారి.

రెండు బంతుల్లోనే ముగిసి కథ
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన స్కాట్లాండ్ కెప్టెన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. స్కాట్లాండ్ బౌలర్ బ్రాడ్ కర్రీ మొదటి ఓవర్ వేయడానికి వచ్చాడు. బ్రాడ్ కర్రీ వేసిన మొదటి బంతికి కెనడా ఓపెనర్ అలీ నదీమ్ బ్యాట్ ఎడ్జ్ తగిలి స్లిప్‌లో ఉన్న మార్క్ వాట్ చేతిలో పడింది. దీంతో మ్యాచ్ మొదటి బంతికే కెనడా మొదటి వికెట్ కోల్పోయింది. స్కోరు బోర్డులో ఒక్క పరుగు కూడా చేరకుండానే కెనడా మొదటి వికెట్ కోల్పోయింది.

Unprecedented in 148 Years Canada s Openers Out in First Two Balls

ఇదిలా ఉండగా.. మొదటి బంతి షాక్ నుంచి కెనడా తేరుకోకముందే.. రెండో బంతి మరింత పెద్ద షాక్ ఇచ్చింది. నాన్-స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న యువరాజ్ సామ్రా పరుగు కోసం సిద్ధమవుతుండగా.. బ్యాటర్ పార్గత్ సింగ్ కొట్టిన స్ట్రైట్ డ్రైవ్ బంతి బౌలర్ బ్రాడ్ కర్రీ కాలికి తగిలి వికెట్లను తాకింది. ఆ సమయంలో సామ్రా క్రీజు బయట ఉండడంతో రనౌట్ అయ్యాడు. ఈ రెండు ఔట్‌లు కేవలం రెండు బంతుల్లోనే జరగడం అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఒక అసాధారణ సంఘటన. టెస్ట్, వన్డే, టీ20.. ఇలా ఏ ఫార్మాట్‌‌లో కూడా ఒక ఇన్నింగ్స్ మొదటి రెండు బంతుల్లోనే ఇద్దరు ఓపెనర్లు ఔట్ కావడం గతంలో ఎన్నడూ జరగలేదు.

కెనడా పోరాటం.. సులభంగా గెలిచిన స్కాట్లాండ్
తొలి రెండు బంతుల తర్వాత కెనడా జట్టు కోలుకోలేకపోయింది. బ్రాడ్ కర్రీ అద్భుతమైన బౌలింగ్ కొనసాగించి మరో 3 వికెట్లు తీశాడు. దీంతో కెనడా స్కోరు ఒక దశలో 18 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అయితే ఈ క్లిష్ట పరిస్థితుల్లో శ్రేయస్ మోవ్వా(60) బాధ్యతాయుతంగా ఆడి జట్టు స్కోరును 184 పరుగులకు చేర్చాడు. ఆ తర్వాత 185 పరుగుల లక్ష్యాన్ని స్కాట్లాండ్ సులభంగా ఛేదించింది. ఓపెనర్ జార్జ్ మున్సే అజేయంగా 84 పరుగులు చేయగా.. కెప్టెన్ రిచీ బెరింగ్టన్ 64 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు. స్కాట్లాండ్ 41.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో స్కాట్లాండ్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించగా.. కెనడా మాత్రం క్రికెట్ చరిత్రలో ఓ చెత్త రికార్డును నమోదు చేసుకుంది.

Story first published: Sunday, September 7, 2025, 13:37 [IST]
Other articles published on Sep 7, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+