For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

డోపింగ్‌లో దొరికిపోయిన భారత క్రికెటర్: పేరు వెల్లడికి నో

భారత్‌కు చెందిన ఓ క్రికెటర్ డోప్ టెస్టులో దొరికిపోయాడు. ఈ విషయాన్ని వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(వాడా) తాజాగా స్సష్టం చేసింది.

By Nageshwara Rao

హైదరాబాద్: భారత్‌కు చెందిన ఓ క్రికెటర్ డోప్ టెస్టులో దొరికిపోయాడు. ఈ విషయాన్ని వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(వాడా) తాజాగా స్సష్టం చేసింది. 2016 డోపింగ్ టెస్టుల్లో భాగంగా నివేదిక విడుదల చేసిన వాడా, ఒక భారత క్రికెటర్ గతేడాది నిషేధిత ఉత్ప్రేరకం వాడినట్లు వాడా తన నివేదికలో పేర్కొంది.

అయితే ఆ క్రికెటర్ ఎవరనేది మాత్రం పేర్కొనలేదు. టోర్నీ సందర్భంగా మొత్తం 138 మంది బీసీసీఐ అనుబంధ క్రికెటర్లకు డోప్‌ టెస్ట్‌ నిర్వహించగా అందులో ఒకరు దోషిగా తేలినట్టు ఆ నివేదిక పేర్కొంది. దేశవాళీ మ్యాచ్‌ల సందర్భంగా ఆటగాళ్ల నుంచి సేకరించిన శాంపిల్స్‌ను పరీక్షించగా అందులో ఒకరు డోపీగా తేలినట్లు వాడా పేర్కొంది.

Unnamed cricketer tests positive for banned substance: WADA report

డోపింగ్‌లో ఓ భారత క్రికెటర్ దొరకడం ఇది రెండోసారి కావడం గమనార్హం. గతంలో 2013లో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాడు ప్రదీప్‌ సంగ్వాన్‌ డోప్ టెస్టులో పట్టుబడిన విషయం తెలిసిందే.

అయితే, ఆ క్రికెటర్ ఎవరో తెలుసుకునేందుకు బీసీసీఐని సంప్రదించగా వాడా నుంచి తమకు ఎలాంటి నివేదిక అందలేదని, ప్రస్తుతానికి ఆ క్రికెటర్ ఎవరో తమకు కూడా తెలియదని బీసీసీఐకి చెందిన ఓ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+