గాయంతోనే వీరోచిత పోరాటం చేసి సెంచరీ సాధించిన యువ క్రికెటర్


హైదరాబాద్: ఢిల్లీ వేదికగా జరిగిన విజయ్ హజారే ట్రోఫీ యవ క్రికెటర్ వీరోచిత పోరాటం చేశాడు. అతని దవడకు గాయమైనా ఆటకు సిద్ధమయ్యాడు. అసాధారణ ప్రతిభ చూపించి సెంచరీ చేశాడు. అతని స్కోరు మ్యాచ్‌లో హైలెట్‌గా నిలిచింది.
సోమవారం ఉత్తరప్రదేశ్‌తో ఢిల్లీ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌కు ముందే ప్రాక్టీస్ చేస్తుండగా ఉన్ముక్త్ దవడకు గాయమైంది. అయినా మ్యాచ్‌లో పాల్గొన్న ఢిల్లీ జట్టు ఓపెనర్ ఉన్ముక్త్‌చంద్ 125 బంతుల్లో 116 పరుగులు చేశాడు. 12 ఫోర్లు, 3 సిక్సులు బాది సాహసోపేత ఇన్నింగ్స్ ఆడాడు.
ఇతడి సాహసోపేత ఆటతీరుతో ఢిల్లీ 50 ఓవర్లలో 307/6 పరుగులు చేసింది. చంద్ సహచరుడు హితెన్ దలాల్ (57) కూడా రాణించాడు. ఆ తర్వాత యూపీ 252 పరుగులకే ఆలౌట్ అయ్యింది. 2002లో వెస్టిండీ్‌సపై అనిల్ కుంబ్లే కూడా సరిగ్గా ఇలాంటి పరిస్థితిలోనే బరిలోకి దిగి రాణించాడు.
ఛేదనలో ఉత్తర్‌ప్రదేశ్ 45.3 ఓవర్లలో 252 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఉత్తర ప్రదేశ్ జట్టుకు చెందిన ఉమంగ్ శర్మ 104 బంతుల్లో 102 (102; 104 బంతుల్లో) సెంచరీ చేసినా ఫలితం లేకపోయింది. ఢిల్లీ బౌలర్లలో కుల్వంత్ (4/34), ప్రదీప్ సాంగ్వాన్ (3/28) రాణించారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications