For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విమర్శకులకు చురకలంటించిన ‘యునివర్స్ బాస్’ గేల్

మెల్బోర్న్: వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ మంగళవారం తనపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్న వారిపై తీవ్ర స్థాయిలో స్పందించారు. ఆస్ట్రేలియాలో జరిగిన బిగ్ బాష్ లీగ్(బిబిఎల్)లో పాల్గొన్న క్రిస్ గేల్.. టోర్నీ నుంచి అతను ప్రాతినిథ్యం వహిస్తున్న జట్టు ఇంటి బాట పట్టడంతో అతను కూడా ఆస్ట్రేలియా నుంచి వెస్టిండీస్ దారిపట్టాడు.

మంగళవారం అతను ఆస్ట్రేలియా నుంచి వెస్టిండీస్ పయనమయ్యాడు. అయితే ఈ టోర్నీలో యువరాజ్ సింగ్ నెలకొల్పిన 12బంతుల్లో అర్ధశతకం ప్రపంచ రికార్డును క్రిస్ గేల్ సమం చేశాడు. కాగా, ఈ టోర్నీ సందర్భంగా ఓ టీవీకి చెందిన మహిళా రిపోర్టర్‌తో అసభ్యకరంగా మాట్లాడినందుకు క్రిస్ గేల్ 10వేల డాలర్ల జరిమానా కూడా కట్టాడు.

ప్రత్యక్ష ప్రసారం అవుతున్న కార్యక్రమంలో 'బయటికెళ్లి మందు తాగుదామా?' అని ఆమెతో అన్నాడు క్రిస్ గేల్. అభ్యంతరకర వ్యాఖ్యలు, అసభ్య ప్రవర్తనకు పాల్పడిన క్రిస్ గేల్‌పై అన్ని వర్గాల నుంచి విమర్శలు వచ్చాయి. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ ఓ అడుగు ముందుకేసి క్రిస్ గేల్‌పై ప్రపంచ వ్యాప్తంగా నిషేధం విధించాలని డిమాండ్ చేశాడు.

బిబిఎల్‌లో మెల్బోర్న్ రెనెగేడ్స్ తరపున ఆడిన క్రిస్ గేల్.. సోమవారం జరిగిన మ్యాచులో 12 బంతుల్లోనే అర్ధశతకం చేసి భారత ఆటగాడు యువరాజ్ సింగ్ పేరున ఉన్న ప్రపంచ రికార్డును సమం చేశాడు. అయితే, సోమవారం జరిగిన మ్యాచులో క్రిస్ గేల్ జట్టు ఓటమి పాలైంది. దీంతో ఆ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది.

ఆస్ట్రేలియాలో తనకు అండగా నిలిచిన అభిమానులందరికీ క్రిస్ గేల్ కృతజ్ఞతలు తెలిపాడు. మళ్లీ బిబిఎల్ ఆడేందుకు వస్తానని చెప్పాడు. అంతేగాక, తనను వ్యతిరేకించిన వారికి కూడా గేల్ కృతజ్ఞతలు తెలిపాడు. ఆ తర్వాత తనను విమర్శించిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

'Universe Boss' Chris Gayle lashes out at critics, says thank you to 'haters'

క్రిస్ గేల్ తన ఇన్‌స్టాగ్రాంలో చేసిన వ్యాఖ్యలు:

'రెనెగేడ్స్, మొత్తం ఆస్ట్రేలియా అభిమానుల ప్రేమాభిమానాలకు, మద్దతుకు నా కృతజ్ఞతలు. ప్రజలు నేను నా చివరి ఇన్నింగ్స్‌ను ఆడేశానని అనుకుంటున్నారు. కానీ, నా అభిమానులతో పంచుకున్న జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుండిపోతాయి. నేను ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్న లీగ్‌లలో పాల్గొన్నా. బిగ్ బాష్ లీగ్ అందులో ఒకటి. 'ప్రజలు ఏమి కోరుకుంటే అదే ఇస్తారు'.

కునాల్ 'గోల్డ్ బ్యాట్' శర్మా ఖచ్చితంగా మీరొక దిగ్గజం. మద్దతుగా నిలిచిన ఛాంపియన్ పీర్స్ మోర్గాన్‌కు కృతజ్ఞతలు. నాకు ఆతిథ్యం ఇచ్చిన ఓల్సెన్ స్టాఫ్‌కి, నేను పరుగులు చేసేందుకు సహాయపడిన వారందరికీ కృతజ్ఞతలు.

ప్రపంచ వ్యాప్తంగా క్రిస్ గేల్‌కు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు. మీడియాకు కూడా నా కృతజ్ఞతలు. నన్ను విమర్శించిన వారికి కూడా నా ధన్యవాదాలు. మీరు అంతకంటే ఎక్కువే.
ఇటీవల వివాదం తర్వాత నాపై అనేక మంది విమర్శలు చేశారు. ఓ మాజీ క్రికెటర్ అయితే ముక్కలు ముక్కలుగా నరికేయమన్నారు. మరొకరైతే యువ ఆటగాళ్లకు గేల్ నుంచి చెడు సంకేతాలు వెలుతున్నాయన్నారు.

ఏదేమైనా నాకు మద్దతుగా నిలిచిన ఆస్ట్రేలియా అభిమానులకు ధన్యవాదాలు. నేను మళ్లీ ఆస్ట్రేలియాకు వస్తా. పాటను పరిశీలించడం మర్చిపోకండి. #WeHeroes . #UniverseBoss" అని క్రిస్ గేల్ తన ఇన్‌స్టాగ్రాంలో పేర్కొన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+