

హైదరాబాద్: ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియాకు వాతావరణం ప్రతికూలిస్తుంది. ఈ మేరకు మ్యాచ్‌లో కొన్ని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు ఎసెక్స్ జట్టుతో టీమిండియా ఆడాల్సిన నాలుగు రోజుల మ్యాచ్‌ను మూడు రోజులకు తగ్గించారు. ఈ మ్యాచ్ కోసం కేటాయించిన మైదానానికి వేడి గాలుల తాకిడి అధికంగా ఉండటమే ఇందుకు కారణం. ఈ మ్యాచ్ ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారం బుధవారం మొదలు కావాల్సి ఉండగా.. గురువారం ఆటను ఆరంభించాలని నిర్ణయించారు.
భారత ఆటగాళ్లు మంగళవారం ఇదే మైదానంలో నెట్ ప్రాక్టీస్ చేశారు. ఆ సందర్భంగా వేడి గాలులు ఆటగాళ్లను ఇబ్బంది పెట్టినట్లు తెలుస్తోంది. ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలోనే కోచ్ రవిశాస్త్రి.. ఎసెక్స్ కౌంటీ సిబ్బందితో మాట్లాడాడు. తర్వాతే మ్యాచ్‌ను కుదించాలన్న నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
కౌంటీ జట్టు ఎస్సెక్స్‌తో బుధవారం నుంచి జరిగే నాలుగు రోజుల వామప్ మ్యాచ్ షెడ్యూల్‌ను భారత జట్టు కుదించుకుంది. ఇంగ్లండ్‌తో జరిగే ఐదు టెస్టుల సిరీస్‌కు ముందు భారత్ ఆడే ఏకైక ప్రాక్టీస్ మ్యాచ్ ఇదే. ఇక్కడి వేడి గాలుల కారణంగా మ్యాచ్‌ను మూడు రోజుల్లో ముగించనున్నారు. దీంతో అదనంగా లభించే మరో రోజును విశ్రాంతికి ఉపయోగించి సిరీస్‌కు సన్నద్ధమయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఇక్కడి పిచ్‌పై పచ్చిక ఎక్కువగా ఉండడంతో పాటు అవుట్ ఫీల్డ్ నిర్జీవంగా కనిపిస్తోంది.
దీంతో ఫీల్డింగ్ సమయంలో ఆటగాళ్లకు గాయాలయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే కోచ్ రవిశాస్త్రి, అసిస్టెంట్ కోచ్ బంగర్, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ కలిసి స్థానిక అధికారులతో మాట్లాడి మ్యాచ్ రోజులను తగ్గించినట్టు ముందుగా వార్తలు వచ్చాయి. ఇదిలావుండగా భారత ఆటగాళ్లు సోమవారం నెట్స్‌లో నాలుగు గంటలపాటు శ్రమించారు. స్లిప్ క్యాచ్‌ల్లో వైఫల్యాన్ని అధిగమిం చేందుకు పుజారా, మురళీ విజయ్, కోహ్లీ ఎక్కువగా కష్టపడ్డారు.
ఐతే ఈ మైదానంలో పిచ్, ఔట్‌ఫీల్డ్ ప్రమాదకర రీతిలో ఉండటంతోనే మ్యాచ్‌ను మూడు రోజులకు కుదించాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చిందని కూడా వార్తలు రావడం గమనార్హం. కానీ ప్రాక్టీస్ వసతులపై తటీమిండియా సంతృప్తి వ్యక్తం చేసిందని ఎసెక్స్ ప్రతినిధి తెలిపాడు. బీసీసీఐ విజ్ఞప్తి మేరకే మ్యాచ్‌ను మూడు రోజులకు కుదించామని చెప్పిన ఎసెక్స్ యాజమాన్యం.. మరే కారణం పేర్కొనలేదు.