Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాపం విలియమ్సన్‌‌..ఇలా ఔటవ్వడం పుష్కరకాలంలో తొలిసారి (Video)

వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా పైచేయి సాధిస్తుంది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 383 పరుగుల భారీ స్కోరు సాధించింది. కామెరూన్ గ్రీన్ (174*; 275 బంతుల్లో) సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. గ్రీన్ తర్వాత జట్టులో అత్యధిక స్కోరు మిచెల్ మార్ష్ సాధించిన 40 పరుగులే.

అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్‌కు పేలవారంభం దక్కింది. 29 పరుగులకు అయిదు వికెట్లు కోల్పోయింది. టామ్ లాథమ్ (5; 13 బంతుల్లో), కేన్ విలియ్సన్ (0; 2 బంతుల్లో), రచిన్ రవీంద్ర (0; 3 బంతుల్లో), డారిల్ మిచెల్ (11; 37 బంతుల్లో), విల్ యంగ్ (9; 50 బంతుల్లో) వరుసగా పెవిలియన్‌కు చేరారు.

Unfortunately Kane Williamson got run out.. first time in 12 years

అయితే కేన్ విలియమ్సన్ దురదృష్టవశాత్తు రనౌటయ్యాడు. స్టార్క్ బౌలింగ్‌లో మిడాఫ్ మీదుగా సింగిల్‌కు ప్రయత్నించాడు. అది అంత సులువుగా దొరికే పరుగు కూడా కాదు. అయినప్పటికీ విలియమ్సన్ ట్రై చేశాడు. మరోవైపు పరుగు కోసం ప్రయత్నించిన న్యూజిలాండ్ ఇద్దరు బ్యాటర్లు ఒకరినొకరు ఢీకొన్నారు. బంతిని గమనించి వెళ్లిన విల్ యంగ్.. విలియమ్సన్‌కు బలంగా తగిలాడు.

అప్పటికీ క్రీజులో బ్యాటును పెట్టడానికి విలియమ్సన్ తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ బంతిని అందుకున్న లబుషేన్ నేరుగా వికెట్లకు త్రో వేశాడు. అయితే న్యూజిలాండ్ బ్యాటర్లు ఒకరినొకరు ఢీకొనడానికి ఆస్ట్రేలియా బౌలర్ స్టార్క్ కూడా ఓ కారణమే. అతడు ఎదురుగా ఉండటంతో బ్యాటర్లు రన్ కోసం చేసిన ప్రయత్నం గందరగోళంగా మారింది. మొత్తంగా విలియమ్సన్ రనౌటయ్యాడు.

అయితే టెస్టుల్లో గత 12 ఏళ్లలో కేన్ విలియమ్సన్ రనౌటవ్వడం ఇదే తొలిసారి. సూపర్ ఫామ్‌లో ఉన్న అతడు ఖాతా తెరవకముందే పెవిలియన్‌కు చేరడం న్యూజిలాండ్‌ను కోలుకోలేని దెబ్బతీసింది. గత రెండు టెస్టుల్లో సౌతాఫ్రికాపై విలియమ్సన్ మూడు శతకాలు బాదాడు. గత నాలుగు ఇన్నింగ్స్‌లో విలియమ్సన్ చేసిన పరుగులు 118, 109, 43, 133*. అదే జోరును కొనసాగించాలనుకున్న విలియమ్సన్‌కు దురదృష్టం వెంటాడింది.

Story first published: Friday, March 1, 2024, 10:22 [IST]
Other articles published on Mar 1, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+