న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Food Recall: చికెన్ సరిగ్గా ఉడకలేదంటూ స్టేడియంలో ప్రకటన, ఆశ్చర్యంలో అభిమానులు!

Undercooked chicken sparks mass food recall at cricket Test between Australia and New Zealand at Optus Stadium

హైదరాబాద్: చికెన్ సరిగ్గా ఉడకలేదని, వాటిని తిరిగి ఇచ్చేయాలంటూ మ్యాచ్‌ని వీక్షిస్తోన్న అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తారు పెర్త్‌ స్టేడియంలోని క్యాంటీన్‌ నిర్వాహకులు. ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య పెర్త్ వేదికగా జరిగిన డే నైట్ టెస్టు ఆఖరి రోజు ఆటలో భాగంగా ఈ సంఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే... మ్యాచ్‌ని వీక్షించడానికి వచ్చిన అభిమానులు స్టేడియంలోని క్యాంటీన్‌లో చికెన్‌తో వండిన సమోసాలతో పాటు ఇతర ఐటమ్స్‌ను కొనుగోలు చేస్తుంటారు. అయితే, ఆదివారం స్టేడియంలోని క్యాంటీన్‌లో చికెన్‌తో వండిన సమోసాలతో ఇతర ఐటమ్స్‌లో చికెన్ సరిగా ఉడకలేదట.

<strong>మైదానంలోకి శునకం.. వెంటబడ్డ విండీస్ ఆటగాళ్లు.. మ్యాచ్‌కు అంతరాయం (వీడియో)!!</strong>మైదానంలోకి శునకం.. వెంటబడ్డ విండీస్ ఆటగాళ్లు.. మ్యాచ్‌కు అంతరాయం (వీడియో)!!

క్యాంటీన్‌లో ఫిర్యాదు చేసిన అభిమాని

ఈ విషయమై వాటిని కొనుగోలు చేసిన అభిమాని ఒకరు క్యాంటీన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో క్యాంటీన్‌లో సమోసాలతో పాటు ఇతర ఐటమ్స్‌ను కొనుగోలు చేసినవాళ్లంతా వాటిని వెనక్కి ఇచ్చేయాలంటూ నిర్వాహకులు స్టేడియంలోని పెద్ద పెద్ద ఎల్‌ఈడీ బోర్డుపై ఈ ప్రకటన వచ్చేలా చేశారు. దీనిపై సోషల్‌మీడియాలో విమర్ళలతోపాటు జోకులూ వెల్లువెత్తాయి.

296 పరుగుల తేడాతో ఆసీస్ విజయం

296 పరుగుల తేడాతో ఆసీస్ విజయం

ఇదిలా ఉంటే, ఈ డే/నైట్‌ తొలి టెస్టులో ఆస్ట్రేలియా 296 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఆసీస్ పేసర్‌ మిషెల్‌ స్టార్క్‌ రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 9 వికెట్లతో విజృంభించడంతో కివీస్‌ విలవిలలాడింది. ఇప్పటి వరకు ఆడిన ఆరు డే/నైట్‌ టెస్టుల్లో విజయం సాధించిన ఆస్ట్రేలియా మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఫలితంగా ఆ సంఖ్యను ఏడుకు పెంచుకుంది.

171 పరుగులకే ఆలౌటైన న్యూజిలాండ్

171 పరుగులకే ఆలౌటైన న్యూజిలాండ్

468 పరుగుల లక్ష్యంతో ఆదివారం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన న్యూజిలాండ్‌ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. స్టార్క్‌ (4/45), నాథన్ లియాన్‌ (4/63) ధాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి 65.3 ఓవర్లలో 171 పరుగులకే ఆలౌటైంది. వాట్లింగ్‌ (40), గ్రాండ్‌హోమ్‌ (33) పోరాడారు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 167/6తో నాలుగో రోజు ఆట కొనసాగించిన ఆసీస్‌.. 217/9 వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ డిక్లేర్‌ చేసి న్యూజిలాండ్‌కు 468 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. కివీస్‌ బౌలర్లలో టీం సౌథీ ఐదు, వాగ్నర్‌ మూడు వికెట్లు పడగొట్టారు.

స్టార్క్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు

స్టార్క్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు

ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌటైంది. లబుషేన్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌కు ఆసీస్‌ బౌలర్లు చుక్కులు చూపించారు. దీంతో కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 166 పరుగులకే ఆలౌట్ అయింది. 250 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సంపాదించిన ఆసీస్.. ప్రత్యర్థిని ఫాలోఆన్‌ ఆడించకుండా రెండో ఇన్నింగ్స్‌ ఆడింది. రెండు ఇన్నింగ్స్‌ల్లో 9 వికెట్లు పడగొట్టిన స్టార్క్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు దక్కింది.

Story first published: Monday, December 16, 2019, 13:57 [IST]
Other articles published on Dec 16, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X