హ్యాట్రిక్ క్లీన్‌స్వీప్
రోహిత్ శర్మ కెప్టెన్సీ చేపట్టాక టీమిండియా రెచ్చిపోతుంది. వరుస పెట్టి ప్రత్యర్థులను వైట్‌వాష్ చేస్తోంది. ఈ క్రమంలోనే వరుసగా మూడు టీ20 సిరీస్‌ల్లో ప్రత్యర్థులను క్లీన్‌స్వీప్ చేసింది. హిట్‌మ్యాన్ కెప్టెన్సీ చేపట్టాక తొలి సారి గతేడాది చివర్లో న్యూజిలాండ్‌తో టీమిండియా టీ20 సిరీస్ ఆడింది. ఆ సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది. ఆ తర్వాత వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ను కూడా 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. తాజాగా శ్రీలంకను కూడా 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది.
రోహిత్ కెప్టెన్సీలో ఒక్క ఓటమి కూడా లేదు
మధ్యలో వన్డే ప్రార్మాట్‌లోనూ వెస్టిండీస్‌ను టీమిండియా 3-0 తేడాతో వైట్‌వాష్ చేసింది. ఆ వన్డే సిరీస్‌ను కూడా కలుపుకుంటే హిట్‌మ్యాన్ కెప్టెన్సీ చేపట్టాక టీమిండియా వరుసగా 4 సిరీస్‌ల్లో ప్రత్యర్థులను వైట్‌వాష్ చేయడం విశేషం. రోహిత్ కెప్టెన్సీ చేపట్టి 3 నెలలు గడుస్తుండగా అతని నాయకత్వంలో టీమిండియా ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. వరుసగా 12 మ్యాచ్‌ల్లో భారత్ గెలిచింది. అయితే ఈ విజయాలన్నీ టీమిండియా సొంత గడ్డపైనే సాధించింది. రోహిత్ కెప్టెన్సీలో భారత్ ఇంకా విదేశాల్లో పర్యటించలేదు. దీంతో విదేశాల్లోనూ ఇదే జోరును ప్రదర్శించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

కెప్టెన్సీ రికార్డులు
రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఇప్పటివరకు 28 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఇండియా రికార్డు స్థాయిలో 24 మ్యాచ్‌ల్లో గెలిచింది. విజయాల శాతం 85గా ఉంది. ఇక 13 వన్డే మ్యాచ్‌ల్లో 11 గెలిచింది. విజయాల శాతం 84గా ఉంది. దీంతో రోహిత్ శర్మ అద్బుత కెప్టెన్సీపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇదే ఊపుతో ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌ను గెలవాలని అభిమానులు ఆశిస్తున్నారు. మరికొంతమంది రోహిత్‌శర్మది గోల్డెన్ హ్యాండ్ అంటూ కొనియాడుతున్నారు. హిట్‌మ్యాన్ ఏది పట్టిన బంగారమే అవుతుందంటున్నారు. కాగా రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ 5 సార్లు ట్రోఫీ గెలిచిన సంగతి తెలిసిందే.

వరుసగా 12వ విజయం
శ్రీలంకపై ఆదివారం సాధించిన విజయంతో టీమిండియా రికార్డు సృష్టించింది. ఈ ఫార్మాట్‌లో వరుసగా 12వ విజయాన్ని నమోదు చేసింది. ఈ క్రమంలో వరుసగా 12 విజయాలు సాధించిన ఆఫ్ఘనిస్థాన్, రోమేనియా రికార్డును టీమిండియా సమం చేసింది. గత ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్ నుంచి భారత్ విజయాల యాత్ర మొదలైంది. ఆ తర్వాత టీమిండియా ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు.


Click it and Unblock the Notifications












