అచ్చం ధోనీలాగే విలియమ్సన్ కూడా..

హైదరాబాద్: మ్యాచ్ ఎంతటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నా.. మైదానంలో ప్రశాంతంగా కనిపిస్తుంటాడు ధోనీ. జట్టు ప్రదర్శన, ఆట తీరులో మార్పు కనబరుస్తాడు కానీ, ఎట్టి పరిస్థితుల్లోనూ కంగారుపడటం, ఉద్వేగానికి లోనవడం వంటివి చేయడు. ఇప్పుడు అచ్చం ధోనీలాగే వ్యవహరిస్తున్నాడంటూ సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను పోలుస్తున్నాడు సునీల్ గవాస్కర్.

వార్నర్ తప్పుకోవడంతో యాజమాన్యంతో సహా షాక్‌కు:
మ్యాచ్‌లో ఉత్కంఠకు లోనైన సందర్భాల్లోనూ ప్రశాంతతను వీడట్లేదని, తద్వారా జట్టు సభ్యుల్లో ఉద్వేగాన్ని తగ్గిస్తున్నాడని పేర్కొన్నారు. బాల్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా ఆసీస్ ఆటగాడు డేవిడ్ వార్నర్ మ్యాచ్ నుంచి తప్పుకోవడంతో యాజమాన్యంతో సహా అభిమానులు కూడా షాక్‌కు గురైయ్యారు.

పట్టికలో 14 పాయింట్లతో అగ్రస్థానంలో :
అంతే స్థాయిలో కొత్త కెప్టెన్ న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ నాయకత్వ బాధ్యతలు సరిగా నిర్వర్తిస్తాడా అనే సందేహాలు వ్యక్తం చేశారు. కానీ, అవన్నీ పటాపంచలు చేస్తూ.. ఆ బాధ్యతలు అత్యుత్తమంగా నెరవేరుస్తున్నాడు కేన్. నిలకడగా రాణిస్తూ చక్కని విజయాలు అందించాడు. దీంతో 9 మ్యాచుల్లో 7 గెలిచిన హైదరాబాద్ పాయింట్ల పట్టికలో 14 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.

గతేడాది విలియమ్సన్‌కు అవకాశాలు రాలే:
జట్టులో విదేశీ ఆటగాళ్లు నలుగురే ఉండాలన్న నిబంధనతో గతేడాది విలియమ్సన్‌కు తగినన్ని అవకాశాలు రాలేదు. ఈ సారి మాత్రం ప్రతి మ్యాచ్‌లో బాధ్యతాయుతంగా ఆడుతూ 9 మ్యాచుల్లో 364 పరుగులు చేశాడు. మెరుపు సిక్సర్లు బాదకున్నా నిలకడగా హాఫ్ సెంచరీలు సాధిస్తున్నాడు.

ధోనీలాగే విలియమ్సన్ చాలా ప్రశాంతంగా:
‘సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో ఆటగాళ్లందరిలో కొత్త ఉత్సాహం నింపుతున్నాడు కేన్ విలియమ్సన్. గత సీజన్‌లో అతడికి తగినన్ని అవకాశాలు రాలేదు. ఈ ఏడాది వార్నర్ లేకపోవడంతో కేన్‌కు కెప్టెన్సీ దక్కింది. చక్కని ఇన్నింగ్స్‌లు ఆడుతూనే తన బాధ్యతలను అద్భుతంగా నెరవేరుస్తున్నాడు. మెరుపు స్కోర్ల కన్నా నిలకడగా పరుగులు చేయడం ఎంత ముఖ్యమో చూపిస్తున్నాడు. ధోనీలాగే విలియమ్సన్ చాలా ప్రశాంతంగా ఉంటాడు' అని గవాస్కర్ అన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications