Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనీ చేయలేకపోయిన దానిని కోహ్లీ చేయగలడు: గంగూలీ

Under Kohli, India can succeed in England and Australia: Sourav Ganguly

హైదరాబాద్: సఫారీ పర్యటనను ఆతిథ్యజట్టుపై 2-1 తేడాతో ముగించుకున్న భారత్‌ను టీమిండియా మాజీ కెప్టెన్ ప్రశంసించారు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లోనూ కోహ్లి సారథ్యంలో టీమిండియా మెరుగైన ప్రదర్శన చేయగలదని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ధీమా వ్యక్తం చేశాడు. ఓ ప్రముఖ మీడియాకు ఆయన రాసిన వ్యాసంలో భారత్ పర్యటనల గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ నాయకత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు.

చివరిసారిగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పర్యటనలకు వెళ్లిన భారత జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. అప్పట్లో మహేంద్రసింగ్ కెప్టెన్సీలోని టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనని 0-2తో, ఆస్ట్రేలియా టూర్‌ని 1-3తో పేలవ రీతిలో ముగించింది. అయితే.. గత వారం ముగిసిన దక్షిణాఫ్రికా పర్యటనని చూసిన తర్వాత.. కోహ్లి నాయకత్వంలోని భారత జట్టు ఆ రెండు దేశాల్లో మెరుగైన ప్రదర్శన చేయగలదని గంగూలీ వివరించాడు.

ఇటీవల ముగిసిన దక్షిణాఫ్రికా పర్యటనలో తొలుత మూడు టెస్టుల సిరీస్‌ని 1-2తో చేజార్చుకున్న భారత జట్టు ఆరు వన్డేల సిరీస్‌ని 5-1తో, మూడు టీ20ల సిరీస్‌ని 2-1తో చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జూన్‌లో ఇంగ్లాండ్‌లో పర్యటించనున్న భారత్.. అనంతరం చివర్లో ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్లనుంది.

'ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలో సిరీస్‌లు గెలవాలనేది ప్రతి పర్యాటక జట్టు కల. ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనలో విరాట్ కోహ్లి బ్యాటింగ్‌ని మరోస్థాయికి తీసుకెళ్లాడు. రాబోయే పర్యటనల్లో.. ముఖ్యంగా టెస్టుల్లో టీమిండియా సత్తాచాటేలా ఈ ప్రదర్శన స్ఫూర్తి నింపుతుంది. ఫాస్ట్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా చాల మెరుగ్గా బౌలింగ్ చేశారు. భారత బౌలింగ్ భవితవ్యం వారిపైనే ఆధారపడి ఉంది. సఫారీ గడ్డపై ఓటమితో సిరీస్‌ని ఆరంభించినా.. గెలుపుతో ముగించేలా భారత్‌ పుంజుకున్న విధానం అద్భుతం. ఈ జట్టు కచ్చితంగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలో అద్భుతాలు చేస్తుంది' అని గంగూలీ వివరించాడు.

Story first published: Tuesday, February 27, 2018, 16:06 [IST]
Other articles published on Feb 27, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+