అండర్ 19: న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం
మిర్‌పుర్: బంగ్లాదేశ్‌లో జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో భారత్ తన జోరుని కొనసాగిస్తోంది. గ్రూప్-డిలో భాగంగా శనివారం న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత్ 120 పరుగుల తేడాతో విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లను కోల్పోయి 258 పరుగులు చేసింది. భారత్ ఆటగాళ్లలో కెప్టెన్ ఇషాన్ కిషన్(4), రికీ భూయి (1) నిరాశ పరిచినప్పటికీ, రిషబ్ పాంట్(57), సర్ఫరాజ్ ఖాన్ (74), ఆర్మాన్ జాఫర్ (46), లామ్రోర్ (45)లు రాణించారు.

259 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ న్యూజిలాండ్ 31.3 ఓవర్లలో 138 పరుగులకే ఆలౌట్ అయింది. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ లియోపార్డ్ (40), అలెన్(29), పారిక్(26), స్కాట్(29)లు పరుగులు చేయగా, ఏడుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.
టీమిండియా బౌలర్లలో లామ్రోర్ ఐదు, అవిష్ ఖాన్ నాలుగు వికెట్లు తీసుకోగా, అన్సారీకి ఒక వికెట్ దక్కింది. ఈ విజయంతో టీమిండియా ఈ టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని సాధించగా, కివీస్ రెండో ఓటమిని చవిచూసింది. ఫిబ్రవరి 1న తేదీన క్వార్టర్ ఫైనల్స్‌లో నేపాల్ జట్టుతో భారత్ తలపడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications