Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బీపీఎల్‌లో స్మిత్ ను ఎలా ఆడిస్తారు?

Uncertainty over Steven Smiths participation in BPL

న్యూ ఢిల్లీ: బాల్ టాంపరింగ్ ఉదంతం కారణంగా ఏడాది పాటు నిషేధానికి గురైన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ దేశీవాలీ లీగ్‌లలో రాణిస్తూ ఫామ్‌ను కాపాడుకుంటున్నాడు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ నిర్వహిస్తోన్న బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2019లో ఆడేందుకు ఒప్పందం చేసుకున్నాడు. వచ్చే జనవరి నెలలో ప్రారంభం కానున్న బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)లో కొమిల్లా విక్టోరియన్స్ జట్టు తరుపున ఆడేందుకు గాను ఆ ఫ్రాంఛైజీ స్టీవ్ స్మిత్ ఒప్పందం చేసుకుంది. అయితే ఇప్పుడు స్మిత్ జట్టులో ఆడటమనేది ప్రశ్నార్థకంగా మారింది.

గుణరత్నేకు బదులుగా విక్టోరియన్స్ జట్టులో

గుణరత్నేకు బదులుగా విక్టోరియన్స్ జట్టులో

ఎసిలా గుణరత్నేకు బదులుగా కొమిల్లా విక్టోరియన్స్ జట్టులో ఆడించాలనుకన్న జట్టు ఇప్పుడు స్టీవ్ స్మిత్‌ను ఆడించే విషయంలో తర్జనభర్జనలు పడుతోంది. జట్టులో ఉన్న ప్లేయర్లను కాకుండా వారి స్థానంలో బయటివాళ్లను తీసుకోవడమేంటని అదే లీగ్‌లో ఆడుతోన్న రంగపూర్ రైడర్స్ ప్రశ్నించడంతో దానికి మద్ధతుగా మిగిలిన చానెళ్లు వివాదం లేవనెత్తాయి. దీనిపై బీపీఎల్ టెక్నికల్ కమిటీ ఛైర్మన్ జలాల్ యూనస్ మాట్లాడుతూ.. ఈ సమస్యపై త్వరలోనే పరిష్కరించి విక్టోరియన్స్‌కు తెలియపరుస్తామని తెలిపారు.

షోయబ్ మాలిక్ స్థానాన్ని భర్తీ చేస్తాడనుకుంటే

షోయబ్ మాలిక్ స్థానాన్ని భర్తీ చేస్తాడనుకుంటే

సైల్హట్ వేదికగా జరిగే మ్యాచ్‌లకు స్మిత్ అందుబాటులో ఉంటాడని కోచ్ భావించాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్) రెండో సీజన్ మొత్తానికి పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ అందుబాటులో ఉండటం లేదు. దీంతో అతడి స్థానంలో స్టీవ్ స్మిత్‌ను ఎంపిక చేసుకున్నట్లు పేర్కొన్నాడు.

 స్టీవ్ స్మిత్ ఆడుతోన్న మూడో టీ20 లీగ్ ఇదే

స్టీవ్ స్మిత్ ఆడుతోన్న మూడో టీ20 లీగ్ ఇదే

స్మిత్‌తో పాటు ఏడాది పాటు నిషేధానికి గురైన డేవిడ్ వార్నర్ సైతం ఈ టోర్నీలో సైల్హట్ సిక్సర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నాడు. బీపీఎల్ రెండో సీజన్ జనవరి 5 నుంచి ఫిబ్రవరి 8 వరకు జరగనుంది. కెనడా గ్లోబల్ టీ20 లీగ్, కరేబియన్ ప్రీమియర్ లీగ్ తర్వాత స్టీవ్ స్మిత్ ఆడుతోన్న మూడో టీ20 లీగ్ ఇదే కావడం విశేషం.

ఏడాది పాటు నిషేధం విధించిన క్రికెట్ ఆస్ట్రేలియా

ఏడాది పాటు నిషేధం విధించిన క్రికెట్ ఆస్ట్రేలియా

దీంతో పాటు వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలో జరిగే పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో సైతం స్టీవ్ స్మిత్ ఆడనున్నాడు. ఈ ఏడాది మొదట్లో సఫారీ గడ్డపై బాల్ టాంపరింగ్‌కు పాల్పడినందుకు గాను స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లపై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

Story first published: Wednesday, December 12, 2018, 13:27 [IST]
Other articles published on Dec 12, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+