
ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఆడలేదు:
న్యూజిలాండ్ జట్టు ఎంపికలో అతిపెద్ద సర్ప్రైజ్ ఏంటంటే వికెట్ కీపర్ టామ్ బ్లండెల్ ఎంపికే. ఎందుకంటే బ్లండెల్ ఇంతవరకు ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే కివీస్ తరపున 2 టెస్టులు, 3 టీ-20లు ఆడాడు. టామ్ లాతమ్ కు ఇప్పటి వరకు టిమ్ సైపెర్ట్ బ్యాకప్ కీపర్ గా ఉన్నాడు. గత నెలలో అతడి వేలుకి గాయం అవడంతో బ్లండెల్ జట్టులోకి వచ్చాడు.

సోధికి అవకాశం:
ఆల్ రౌండర్ జాబితాలో డగ్ బ్రాస్‌వెల్ స్థానంలో కొలిన్ గ్రాండ్‌హోమ్ చోటు సంపాదించాడు. టాడ్ ఆస్ట్లేను కాదని ఇస్ సోధికి అవకాశం ఇచ్చారు సెలెక్టర్లు. పేసర్లలో లూకీ ఫర్గూసన్, ట్రెంట్ బోల్ట్, టిమ్ సౌథీలకి తోడుగా మాట్ హెన్రీని ఎంపిక చేశారు. టాప్ బ్యాటర్లు అందరూ కూడా అవకాశం దక్కించుకున్నారు. సెలెక్టర్లు న్యూజిలాండ్ బాధ్యతలు కేన్ విలియమ్సన్ కు అప్పగించారు.

న్యూజిలాండ్ జట్టు:
కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాస్ టేలర్, టామ్ లాతమ్ (వికెట్ కీపర్), టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), మిచెల్ శాంట్నర్, కొలిన్ గ్రాండ్‌హోమ్, లూకీ ఫర్గూసన్, టిమ్ సౌథీ, ట్రెంట్ బోల్ట్, కొలిన్ మున్రో, ఇస్ సోధి, హెన్రీ నికోల్స్, మార్టిన్ గప్తిల్, మాట్ హెన్రీ, జిమ్మీ నీషం.


Click it and Unblock the Notifications













